పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా నుడి


ఇప్పటివరకు నేను చేనిన జీవిత ప్రయాణంలో వివిధ థసలలో ఇతర భాషలవారితో కలని జీవించే భాగ్యం నాకు లభించింది. వారితో కలని జీవించినపుడు తెలుగు భాషా సాహిత్యాల విద్యార్థినైన నేను నహాజంగానే వారి భాషా సాహిత్యాల పట్ల ఆనక్తిని చూపేవాడిని. దీనివలన భాషా సాహిత్యాల గురించి అనుభ'వపూర్వకంగా నేను గ్రహించిన అనేక విషయాలలో ఒకటి నమానార్థకాలైన సామెతలు వివిధ భాషలలో ఉండడం. ఉదాహారణకు ఈ క్రింది సామెతలను పేర్కొనవచ్చు:

1. తెలుగు
గాలి ఉన్నపుడే తూర్పారబట్టాలి
కన్నడ
గాలి బందాగ్యె తూరికొద్ళ బేకు
తమిదం
కాట్రుద్ళ పోదు తూట్రిక్కొదర
మలయాళం
కాట్రుద్ళపోలర తూట్రవణమ్‌
హిందీ
నమయ్‌ కో దుర్లభర జానో
ఇంగ్లిష్‌
Make hay while the sun shines
2. తెలుగు
నిప్పు లేనిదే పొగరాదు
కన్నడ
కిచ్చిల్లదె హాొగయుంటె
తమిదం
నెరుపల్లామలర పుగయుమా?
మలయాదం
తీయల్దాద్‌ పుగ ఉన్డావుక్‌ యిల్ల
హిందీ
బినా ఘం ఆ న ఆగు
ఇంగ్లిష్‌
No smoke without fire
3. తెలుగు
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణనంకటం
కన్నడ
చెక్కిగె చెల్లాటె, ఇలిగె ప్రాణనంకట
తమిదం
పూనైక్కు కొండాటవమ్‌, ఎలిక్కు తిండాటవమ్‌
మలయాదం
పూచక్కు విలయాటవమ్‌, ఎలిక్కు ప్రాణనంకటమ్‌
హిందీ
చిడియోంకీ మౌత్‌ గవారోం కో హానీ
ఇంగ్లిష్‌
Sport to the cat, death to the rat