పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనుష్య, మనుష్యేతర ప్రాణి నంబంధులుగా విభ'జించారు. మనుష్యేతర ప్రాణి సామెతల విభాగంలో జంతు, పక్షి, కీటకట, జలచరాలను గురించిన ఉప విభాగాలు ఉన్నాయి. మనుష్య నంబంధి సామెతలు చాలా విన్తృత పరిధి కటలిగినవి. ఈ విభాగంలో

1. కటుటుంబ వ్యవహారాలు, 2. అధికారం, 3. స్వభావం, 4. వృత్తి, 5. వర్ణం, 6. ఆహారం 7. వర్తకట, వాణిజ్యాలు, 8. నాణేలు, కొలతలు, 9. సాంన్కృతికట నంబంధి అనే తొమ్మిది ఉప విభాగాలు ఉన్నాయి. సాంన్కృతికట నంబంధిలో మతం, విద్య, వైద్యం, కటదలు, వినోద విలాసాలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మొదలైనవి ఉన్నాయి. 26

ఈ పరిశోధన తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనానికి నంబంధించినది. అందువలన తెలుగు సామెత న్వరూప, న్వభావాలను గురించి తెలునుకటున్న పిదప ఇప్పుడు బైబులు సామెతల న్వరూప న్వభావాలను గురించి తెలునుకటుందాం. అందుకటు బైబులు పరిచయం అవనరం కాబటివ ముందుగా బైబులు గురించి నంక్షిప్తంగా తెలునుకటుందాం.

బైబులు పరిచయం

బైబులు అనే మాట బిబ్లోన్‌ అనే గ్రీకటు పదం నుండి వచ్చినది. ఈ పదానికి పున్తకటం అని అర్థం. అతి శ్రేష్ఠమైన గ్రంథం అనే అర్థంలో దీనిని ఇలా వ్యవహారించారు. ఐతే బైబులు ఒకట పున్తకటం కాదు. 73 పున్తకాల గ్రంథమిది. బైబులులో పూర్వ, నూతన నిబంధనాలున్నాయి. వీనిలో పూర్వ నిబంధనం మాత్రమే యూదుల మత గ్రంథం. పూర్వ, నూతన నిబంధనలున్న బైబులు మొత్తం క్రైన్తవుల మత గ్రంథం.

గ్రంథ నంఖ్య

అన్ని క్రైన్తవ శాఖలు నూతన నిబంధనం గ్రంథాలు 27 అని అంగీకటరిస్తాయి. కాని, పూర్వ నిబంధనం గ్రంథాల నంఖ్య విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు. క్యాతలిక్‌ శాఖ ప్రకారం పూర్వ నిబంధనం గ్రంథాలు 46. కటనుకట బైబులు గ్రంథాలు మొత్తం 73. ప్రొటెనెవంటు శాఖల ప్రకారం పూర్వ నిబంధనం పున్తకాలు 39. కటనుకట వారి ప్రకారం బైబులు గ్రంథాలు మొత్తం 66 మాత్రమే.

26 పి.నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983, పు. 24-27