పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతజ్ఞతాంజలి

  • 'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' మీదపరిశోధన చేయడానికి అనుమతించిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం, రాజమండ్రి ప్రాంగణం పాలకవర్గానికి . . .

�ఈ అవకాశం కల్పించిన మా ఆంధ్ర లొయోల (స్వయం ప్రతిపత్తి)కళాశాల, విజయవాడ, యాజమాన్య, పాలక వర్గాలకు . . .

�ఈ పరిశోధనలో అవసరమైన సూచనలు, సలహాలతో ప్రతిక్షణం ప్రోత్సహించిన సహృదయ పర్యవేక్షకులు ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు గారికి . . .

�ఉపయుక్త గ్రంథ సేకరణంలో సహాయపడిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహాయ గ్రంథాలయాధికారి డా|| నిరీక్షణబాబు, మా కళాశాల గ్రంథాలయాధికారి డా|| ప్రసాదరావు, మిత్రులు ఫాదర్‌ ఫిలమిన్‌రాజ్‌, ఎస్‌.జె., ఫాదర్‌ పాపయ్య, ఎస్‌.జె., గార్లకు . . . మేనకోడలు చిరంజీవిని అనిత విజయశ్రీ కి. . .

�ఈ పరిశోధనలో నాకు సకల విధాల సహకరించిన గురుపుంగవులు పూదోట జోజయ్య, ఎస్‌.జె., గారికి, మా కళాశాల అధ్యాపకులు డా|| జోబ్‌ సుదార్శన్‌, డా|| కృపారావు గార్లకు . . .

�ఈ సిద్ధాంత గ్రంథానికి అక్షర రూపం కల్పించిన శ్రీ ప్రభాత్‌ గారికి

హృదయపూర్వక కృతజ్ఞతాంజలి