పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయీ హిబ్రూ, బల్గేరియా... పోస్లోవినా,, హింది... కహావాత్, కన్నడం ... గాదె, నాణ్ణుడి, లోకోక్తి శాస్త్ర, సామతి, తుళు .... గాదె, కొదవ, తమిళం ... వళమొళి, మలయాళం ... పళంచోల్ , పళచొల్లు.

అ. సామెత - నిర్వచనం.

అరిస్టాల్‌ నుండి నేటి వరకు పలువురు దేశ, విదేశీ సాహిత్య వేత్తలు, సామెతల సంగ్రహకారులు సామెతలను అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్ని ముఖ్య నిర్వచనాలను ఇప్పుడు చూద్దాం.

A proverb is remnant form old philosophy , preserved amidst countless destructions by reason of its brevity and fitness for use -Aristotle

సంక్షిప్త, ప్రయోగార్హత కారణాలుగా అసంఖ్యాకమైనఆటుపోట్లకు మారొడ్డి నిలిచిన ప్రాచీన జిజ్ఞాసావశేషమెత సామెత.

Short sentences drawn from long experience-Cervantas

తరతరాల అనుభవం సృషించిన సంకిప్త వాక్యాలు సామెతలు.

short wisdom of many and the wit of one-Russel

అనేకమందిమంది జ్ఞానం, ఒకని చమత్కారం సామెత.

A short, pithy saying in common and recognized use -The Oxford dictionary of English proverbs

సార్వజనీనమై గుర్తింపబడిన, సారవంతమైన, సంక్షిప్త వ్యక్తీకరణమే సామెత.

A short, pithy saying presenting in a striking from a well know truth- Encylopaedia Americana

ఒక ప్రసద్ధ సత్యాన్ని ఉటంకించే సంక్షిప్త సారవంతమైన వాక్యమే సామెత.

A proverb is a short wise saying which has been accepted into current speech and writing african ncyclopsedia

నేటి సంభాషణలో, సాహిత్యంలో అంగీకరింపబడిన సంకిప్త వివేకయుతమైన పలుకే సామెత. 4


3.జి.ఎస్‌. మోహన్‌, సామెతలలో సాంఘక జీవితం, శ్రీనివాస పబికషన్స్‌ , అనంతపు రం, 1983, పు.4
4.పాపిరడ్డి నరసంహారెడ్డి తెలుగు సామెతలు - జన జీవనం, శ్రీనావాస మురళీ పబికషన్స్‌ , తిరుపతి 1983 పుట 1-2