పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధ్యనున్న చారిత్రక భౌగోళిక నంబంధాలను గుర్తించడం లోను ఈ పద్ధతి ఉపయోగిన్తుం ది. వీరిద్దరి కృషి ఫలితంగా జానపద విజ్ఞానంలో తులనాత్మక అధ్యయనం పెద్ద ఎత్తున ప్రారంభ'మైంది. రిచర్డ్‌ ఎమ్‌. డార్సన్‌, క్లాడ్‌ బ్రెమోండ్‌, ఎడ్మండ్‌ లీచ్‌, ని.ఎమ్‌. బౌరా మొదలైన వాద్ళు జానపద విజ్ఞానంలో పరిశోధనలు పెద్ద ఎత్తున సాగించారు. ఫ్రెంచి దేశానికి చెందిన లెవి స్రావన్‌ ప్రతిపాదించిన కథా నిర్మాణ విశ్లేషణా విధానం జానపద విజ్ఞాన పరిశోధనా రంగంలో నూతన శకాన్ని ప్రారంభించింది.

ఈ. జానపద విజ్ఞాన ప్రయోజనాలు

మానవ సామాజిక, సాంన్కృతిక జీవితాలను ప్రతిబింబించే జానపద విజ్ఞానం వలన ఈ క్రింది ప్రయోజనాలున్నట్లు ఆచార్య ఆర్‌.వి.యన్‌. నుందరం గారు గుర్తించారు.8

1. జానపద విజ్ఞానం జానపదులకు శ్రమను తగ్గించి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిన్తుంది.
2. జానపద విజ్ఞానం తరతరాల నంన్కృతిని కాలగర్భంలో కలినిపోకుండా కాపాడుతుంది.
3. జానపద విజ్ఞానంలోని పొడుపు కథలు మానవులకు బుద్ధి వికాసాన్ని, సామెతలు జీవిత అనుభ'వాలను, వీరగాథలు ధైర్య సాహాసాలను, జానపద కదలు కదాత్మక హాృదయాన్ని అందించి మానవుల నర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయి.
4. జానపద విజ్ఞానం మానవ నమాజంలో నిషిద్ధమైన వాటికి అవకాశం కల్పిన్తుంది.
5. జానపద విజ్ఞానంలోని అనేక అంశాలు శిషవ సాహిత్యంలో ప్రవేశించి దానిని నునంపన్నం చేస్తాయి.

ఇదీ జానపద విజ్ఞాన నంక్షిప్త సైద్ధాంతిక నేపథ్యం. ఈ నేపథ్యంతో సామెతను గురించి తరువాత అధ్యాయంలో తెలునుకుందాం.


8 ఆర్వీయన్‌. నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదు, 1983, పు.12-14

13