పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1. సంస్కృతికి నంబంధించిన విషయాలు
జానపద విజ్ఞానం సంస్కృతికి నంబంధించినది. జానపద విజ్ఞానానికి చెందిన గేయాలు, కథలు, సామెతలు, నమ్మకాలు, ఆభ'రణాలు , పండుగలు, కదలు మొదలైనవన్నీ మానవ సంస్కృతిలో భాగాలే. నంన్కృతిలో భాగం కానిది జానపద విజ్ఞానంలో ఏదీ లేదు.
2. ఏ జననముదాయంలోనైనా సాంప్రదాయకంగా ప్రసారమయ్యేవి
జానపద విజ్ఞానంలో చేరాలంటే ఆ విషయాలు ఏ ఒక్కరో నృషివంచినవీ, ఆ ఒక్కరి పేరుతోనే చెలామణి అయ్యేవీ కాకూడదు. ఒక జననముదాయంలో అవి ప్రచారమవుతుండాలి. ఇవి సాంప్రదాయకమైనవి కూడా కావాలి. ఒక తరంనుండి మరో తరానికి కొన్ని విషయాలు నంక్రమించినపుడే నంప్రదాయ మన్నది ఏర్పడుతుందని ఇక్కడ గమనించాలి.
3. వివిధ రూపాలు కలిగి ఉండడం
జానపద విజ్ఞానానికి ఒక ప్రామాణిక రూపం అంటూ ఉండదు. ఎందుకంటే ఒకే రూపం ఉంటే అది ఒక వ్యక్తికి నంబంధించినది అవుతుంది.అలా కాకుండా ఎవరు రూపొందించినదైనా అది జనుల నోళ్లలో నలిగి, వారికి ఇష్టమైన , తరతరాలుగా వాడుకలో ఉండి, రూపాంతరాలు పొందినపుడే అది జానపద విజ్ఞాన విషయమవుతుంది. అంటే ఒక జానపద విజ్ఞాన విషయానికి ఎన్ని ఎక్కువ రూపాలుంటే అది అంత చెలామణిలో ఉన్నదని అర్ధం. ఇలా రూపాంతరాలు ఉండడం జానపద విజ్ఞాన లక్షణాలలో ఒకటి.
4. మౌఖికంగా కాని , రూఢాత్మకంగా కాని ప్రసారం కావడం
మౌఖికంగా ప్రసారమయ్యేదే జానపద విజ్ఞానమని పలువురు విద్వాంనులు చాలా కాలం భావించారు. అందువల్ల గేయం, కథ, సామెతలాంటి మౌఖికరూపాలను మాత్రమే జానపద విజ్ఞానంగా భావించారు. కాని, ఇటీవలి విద్వాంనులు జానపద విజ్ఞానంలో మౌఖికేతర ప్రక్రియలు కూడా చేరాలనే నంగతిని ఒత్తి చెబుతున్నారు. అందువలన నమ్మకాలు, ప్రదర్శనకదలు మొదలైనవి కూడా జానపద విజ్ఞానంలో చేరడానికి వీలవుతున్నది. వీటిలో వృత్తి నంబంధమైన పనులు,కదలు మొదలైన వాటిని నోటితో చెప్పనవనరం లేకుండానే చూచి నేర్చుకోవచ్చు. రూఢివల్ల తెలును కోవచ్చు. అందువల్ల మౌఖికేతరమైన ప్రసారం కూడా జానపద విజ్ఞాంలో ఉన్నదని విద్వాంనులు గుర్తించారు.
ఆ. జానపద విజ్ఞాన విభాగాలు
జానపద విజ్ఞానాన్ని నమగ్రంగా అవగతం చేనుకోవాలంటే దానిని విభాగాలుగా వర్గీకరించి విశ్లేషించాలి. ఆర్‌.ఎన్‌. బాగ్సు

9