పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశాంతంగా నిద్రాపోవాలి.

10. కడన మనం అన్నివస్తువుల్లోను, అన్నిసంఘ టనల్లోను, అందరు వ్యక్తుల్లోన దైవసాన్నిద్యానిన గుర్తించాలి.

అన్ని వస్తువుల్లోను దైవసాన్నిద్యాన్ని గుర్తించాలి. వస్తువులనిటికీ ఉనికిని మనికినీ దయచేసేది ఆ ప్రభువే. కనుక మనం గాలి, నీరు, కొండలు, నదులు, పైరుపంటలు,చెట్టుచేమలు మొదలైన ప్రకృతి వస్తువులను జూచినప్పుడు వాటిల్లో దేవుని సాన్నిద్యాన్నిగుర్తించాలి. ప్రపంచమూ దానిలోని సమస్త వస్తువులూ ప్రభువ్వే నని చెప్తుంది కీర్తన50,12

అన్ని సంఘటనల్లోను దైవసాన్నిద్యాన్ని దార్శించాలి. ప్రియమెన సంఘటనల్లోను అప్రియమైన సంఘటనల్లోను గూడ దేవుని హస్తం వుంటుంది. మనకు జరిగే ప్రతికార్యమూ ప్రభువుకి తెలుసు. అతని అనుమతి లేనిదే మన తల వెండ్రుక ఒక్కి వూడదు- లూకా 12,7. ఇంకా దేవుని తన్ను ప్రేమించేవాళ్ళకి అన్ని కార్యాలు అనుకూలంగానేజరిగేలా చూస్తాడు - రోమా 8,28.

అందరు వ్యక్తుల్లోను దైవసాన్నిధ్యాన్ని చూడలి. భగవంతుడు నరుణ్ణి తనకుపోలికగా చేసాడు - ఆది 1,28. ఈలోకంలో నరుళ్ళాగ భగవంతుణ్ణి తలపించే ప్రాణిమరొకటి లేదు. కనుక మనం అందరు నరుల్లోను సృష్టికర్తను చూడలి. మనం ఆయావ్యకులను కలసికొనేపుడు వాళ్ళ దేవదూతలకు నమస్కారం చేయడం మంచిపద్ధతి. అన్యుల దేవదూతలు మన యీ యన్యుల్లో దేవుణ్ణి చూడగలిగేలా చేస్తారు. వాళ్ళవల్ల మనకీమనవల్ల వాళ్ళకీ వుపకారమేగాని అపకార జరగకుండ ఉండేలా చేస్తారు.

ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో నడవడం అనే భావాన్ని గుర్తుకితెచ్చుకోవాలి. బైబులు భగవంతుని సన్నిధిలో నడచారు. హనోకు దేవుని సన్నిధిలో నడచాడు - ఆది 5,22. అలాగే నోవా -6,9. అలాగే యెలీషాకూడ - 1రాజు 17,1. ఈ పుణ్య పురుషుల్లాగే మనంకూడ నిరంరతం దేవుని సన్నిధిలో నడుస్తూండలి.

ఈ పడవది చాల విస్తృతమైన అభ్యాసం. ఇది ఆధ్మాత్మిర జీవితంలో పరిణతి చెందినం వాళ్ళకే గాని అలవడదాు. అన్నింటి లోను దేవుణ్ణి, దేవుణ్ణి అన్నింటిలోను చూడ్డం మహా భక్తుల లక్షణం.

9. దైవసాన్నిధ్యాన్ని పాటించడంలో ఎదురయ్యే అవరోధాలు

మనలోని కొన్ని దుర్గుణాల వలన మనం దైవసాన్నిధ్యాన్ని గుర్తించలేక పోతూంటాం. ఇక్కడ వీటినిగూర్చి విచారిద్దాం.

1. గర్వాత్ములు దేవుణ్ణి చూడలేరు. గర్వం వల్లనే ఆదిమానవుడు దేవునిమీదా తిరుగుబాటు చేసాడు. ఆదిపిత సంతానమైన మనంకూడ తరచుగా పొగరువల్ల

71