పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదాహరణకు ఈ క్రింది జపాలు వినియోగించుకోవచ్చు.

ఏలినవారా! దాయచూపండి.
నా దేవా! నా ప్రభువా!
నా మధురమైన యేసూ! నాకు న్యాయాధిపతివి కాక,
రక్షకుడవుగా వుండు.
దేవా! నన్నాదుకోవడనికి శీఘ్రమే రా,
నా చిత్తంగాదు, నీ చిత్తమే నెరవేరాలి.
ఉన్నతమందుసర్వేశ్వరుని మహిమ.
పితనకు సుతునకు పవిత్మ్రాత్మకు మహిమమ కలుగునుగాక.
ప్రభూ! నీకే ద్రోహంగా నేను పాపం చేసాను.
నీ వాక్యం నీ త్రోవకు వెలుగు లాంటిది.
ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.
ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు.
దేవా! నాలో నిర్మల హృదయాన్నిసృజించు.
ప్రభువే నాకు శైలము, కోట, రక్షణదుర్గము
నన్ను నేను చేతుల్లోనికి అర్పించుకొంటున్నాను.
నీ ముఖ కాంతిని నా మీదా ప్రకాశింపనీయి
నీ వద్ద జీవధార వుంది

మనం ప్రతిదినం చదుా వుకొనే బైబులు వాక్యాలను వేటినైనా భక్టితీక్షణ జపాలుగా వాడుకోవచ్చు. బోనవెంచరు భక్తుడు వాకొన్నట్లు, ఈ ప్రార్థనలద్వారా మన ఆత్మ పక్షిలా దేవుని చెంతకు ఎగిరిపోతుంది. మనకు తెలియకుండనే మనం గాలి పీల్చుకొంటాం. ఆలాగే కొంతకాలం అభ్యాసం చేసాక మనకు తెలియకుండానే మన ఆత్మ ఈ జపాలను చెప్పుకపోతూంటుంది.

9. రాత్రి పండుకొనేపు డు మన హృదాయాన్నిఆలోచనలనూ సృష్టివసువులనుండి తొలగించి దేవుని చేతుల్లోకి ఒప్పగించుకోవాలి. అనగా మనలను మనం ప్రభువుకి అర్పించుకోవాలి. ఆ కీర్తనకారునిలాగే నేను పండుకోగానే ప్రశాంతంగా నిద్రిస్తాను. ప్రభూ! నేను సురక్షితముగా మనేలా చేసేవాడిని నీవే అని చెప్పుకోవాలి - 4,8. దేవా! నన్ను నీ చేతు ల్లోకి అర్పించుకొంటున్నాను. నీ రెక్కల మాటున నన్ను సురక్షితముగా దాచివుంచుకో అని మనవి చేసికోవాలి. ఈలాంటిభా వాలతో దైవసాన్నిధ్యాన్ని 70