పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని కోపాన్ని పోగొట్టడనికిగాదు క్రీస్తు బలిఅయింది. అతడు మనకుబదులుగా బలికాలేదు. తండ్రిప్రేమతో ఆ కుమారుణ్ణి అర్పించాడు. ఆకుమారుడు మన కొరకు మన ప్రతినిధిగా బలి అయ్యాడు. ఔను, ఈనాకు బలిని అర్థం చేసికున్న వాళ్ళు క్రీస్తుబలి చక్కగా అర్థమౌతుంది.

56. పూర్వవేదవ్యక్తులూ, బలులూ

బాధామయ సేవకుడూ, ఈసాకు క్రీస్తుకు సూచక వ్యక్తులన్నాం. ఈ సూచకవ్యక్తులు ఇంకా చాల మంది వున్నరు. నీతిమంతుడైన హెబేలు నందు క్రీస్తు వధింపబడ్డడు. యోసేపునందు అన్నదమ్ములు అతన్ని ద్వేషించారు. గోతిలో కూలద్రోసి చంపడనికి సిద్ధమయ్యారు. చివరకు అన్యులకు అమ్మివేసారు. యిర్మీయా యందు అతన్ని ముప్పుతిప్పులు పెట్టారు. ముగ్గురు బాలకులందు అతన్ని నిప్పుల కొలిమిలోనికి త్రోసారు. దానియేలు నందు సింహముల గుంటలో పడ దోసారు. యూదాులు ప్రతిబలిలోను అతన్నే సమర్పించారు. ఓడ నుండి వెలుపలకు రాగానే నోవా సమర్పించిన సమధానబలిలో, పితరులు కొండమీదా సమర్పించిన బలుల్లో, మోషే గుడరంలో సమర్పించిన బలుల్లో అతని అనుయాయులు దేవాలయంలో సమర్పించిన బలుల్లో క్రీస్తు నెలకొని వున్నాడు. ఈ రీతిగా అనాది నుండి ఆయా వ్యక్తుల్లో చారిత్రకంగా సమర్పింపబడ్డడు క్రీస్తు. అతని సమర్పణం ద్వారామనకు రక్షణం సిద్ధించింది. బలిమూర్తియైన క్రీస్తును మననంచేసికొని ధ్యానిద్దాం.

57. క్రీస్తు విధేయత

క్రీస్తును సూచించిన పూర్వవేద వ్యక్తులను తిలకించాం. ఇక, క్రీస్తు మనోభావాలను పరిశీలిద్దాం. అతడు కవలం సిలువమీద చనిపోవడం ద్వారానే మనలను రక్షించలేదు. ఈసాకులాగా ప్రేమతో విధేయతతో చనిపోయా మనలను రక్షించాడు. కనుక క్రీస్తు మానసినభావాలు గూడ చాలా ముఖ్యం.

మొదట క్రీస్తు విదేయతను పరిశీలిద్దాం. ఆదాము అతివిధయ త లోకాన్ని పాపంలో ముంచి వేసింది. కాని క్రీస్తు విధేయత ఈ పాపాత్ములను మళ్ళా నీతిమంతులను చేసింది. అనగా వీళ్ళ రక్షణం ఆర్జించిపిెంది. ఆదాము మంచి సెబ్బరలు తెలియజేసే పండుతిని దేవునితో సమానం కావాలనుకున్నాడు. అది అతని మిడిసిపాటు. కాని క్రీస్తు విధేయుడై మరణానికి - నీచాతి నీచమైన సిలుమ మరణానికి లోబడ్డడు. అది అతని అణకువ ఫిలి 2,8. ఈ యణుకవ లేందే క్రీస్తు సిలువబడి తండ్రికి ప్రియ పడేదిగాదాు. ప్రభు విధేయత మనలను పునీతులను జేయాలని ప్రార్ధిద్దాం.

51