పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కయీను హేబెలును చంపాడు - ఆది 4,8

ఆదాము పాపంవలన దుష్పలితాలను ఆదికాండం సమగ్రంగా వర్ణిస్తుంది. ఆదాము ఏవను చూచి ఈమె నా యొముకల్లో యెముక, దేహంలో దేహం అనుకున్నాడు - 2,23. తనకు దగ్గరి బంధువురాలు, లేక తన ప్రేమకు పాత్రురాలు అని మాటల భావం. ఈలాంటి ఏవను అతడు పాపంచేసాక నిందించడం మొదలుపెట్టాడు. నాయంతట నేను ఈ పండు తినేవాణ్ణికాదు, ఆమే నా చేత తినిపించింది అన్నాడు - 3,12. ఆదామేవ లిద్దరు దేవుని దృష్టిలో సరిసమానులే. ఇద్దరూ మానవులే. ఇద్దరూ దేవుని బిడ్డలే. ఇద్దరూ దేవుని చేరవలసినవాళ్ళే. ఐనా నరుడితోడి నరుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టాడు. కయాను తమ్ముడైన హేబెలుమీదపడి ఆతన్ని సంహరించాడు - 4.8 ఈ ద్వేషభావం మనకూ అనుభపూర్వకంగా తెలిసిందే!

పాపం చేసాక స్త్రీ పురుషునికి బానసగా మారిపోయింది. అతడు ఆమె మీదా అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు -3,16. పాప ఫలితం ఈలా వుంటుంది. ఇక, నరులందారూ దేవుని పోలికగా సృజించినవాళ్ళే. ఐనా నరుడు తోడి నరుణ్ణి ద్వేషించడం మొదలుప్టోడు. కయాను తమ్ముడైన హేబెలుమీదపడి అతన్ని సంహరించాడు 4,8. ఈ ద్వేషభావం మనకూ అనుభవపూర్వకంగా తెలిసిందే!

7. దేవుడు వారి భాషను తారుమారు చేసాడు - ఆది 11,9

లేమెకు తన్ను కొట్టుకువచ్చిన వానిని పట్టుకొని క్రౌర్యంతో చంపివేసాడు. క యీనును చంపిన వానిని ఏడంతలు శిక్షైతేనన్ను చం ప బోయినవానికి డెబ్బదియేడంతలుగా శిక్ష విధిస్తానన్నాడు - 4,23. ఈ లేమెకు క్రూరవాక్యాలను మనసులో పెట్టుకొనే ప్రభువు తర్వాత, శత్రువులను డెబ్బదియేడుసార్లవరకూ క్షమించాలని బోధించాడు - మత్త 18,22.

పాపఫలితంగా నరుని ఆయు:ప్రమాణంకూడ తగ్గి పోయింది. అతడు నూట యిరువందేడ్లు మాత్రమే బ్రతకగలిగే దుర్భలప్రాణి అయ్యాడు - 6,3. నోవా కాలంలో ఆ పుణ్యపురుఫుని కుటుంబంతప్ప మిగిలిన ప్రాణికోిటి అంతా నశించిపోయింది - 6,18.

అటుతరువాత నరుల బాబెలు గోపురం కట్టబోయారు. ఆకాశామ్మంటే గోపురాన్నికట్టి పేరు సంపాదించుకుందామనుకున్నారు - 11,4. కాని దేవుడు వాళ్ళ అహంకారానికి క్రుద్ధుడై నేలమీదకు దిగివచ్చాడు. వాళ్ళ భాషను తారుమారు చేసాడు. నరులను నేల నాలుగు చెరగులకు చెదరగొట్టా డు - 11,8. ఇవి ఆదాము పాపం తెచ్చిట్టిన దాుష్పలితాలు. మన పాపాలవల్ల కూడ ఈలాంటి దుష్పలితాలే సిద్ధిస్తాయి.

8. జంతువులన్నిటి లోను పాము జిత్తులమారిది -3,1

తొలి తల్లిదండ్రులు పాపం చేసారు. కాని ఈ పాపం వాళ్ళనుండి బయలుదేరలేదు. మూడవ వ్యక్తియైున పిశాచం బయల్వెడలింది. ఈ పివాచం ఓ దేవుడుకాదు, దేవుని ప్రతిఘటించి నిలచే ఓ దివ్యశక్తీకాదు. అది భగవంతుడు సృజించిన ప్రాణుల్లో వొకటి. ఆదికాండం ఈ ప్రాణిని పాము అని పిలుస్తుంది. 4