పుట:బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బైబులు పరిచయం

                                                                                  బైబులు భాష్యం-56

ఈ వ్యాసంలో మూడంశాలను పరిశీలిద్దాం. మొదటిది బైబులు సమాచారం,
రెండవది బైబులు పఠనం, మూడవది భక్తివంతమైన బైబులు పఠనం.
                                             1.


1. గ్రంథ సంఖ్య
అన్ని క్రై స్తవ శాఖలు నూత్న వేదగ్రంథాలు 27 అని అంగీకరిస్తాయి. పూర్వ
వేదగ్రంథాల సంఖ్య విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు . క్యాతలిక్‌శాఖ ప్రకారం
పూర్వవేదగ్రంథాలు 46.కనుక బైబులు గ్రంథాలు మొత్తం 73. ప్రోటస్టెంటు శాఖల
ప్రకారం పూర్వవేద పుస్తకాలు 39. బైబులు గ్రంథాలు మొత్తం 66 మాత్రమే..
          ఈ వ్యత్యాసం ఏలా వచ్చింది? హీబ్రూ పూర్వవేదంలో 39 పుస్తకాలు మాత్రమే
వున్నాయి. ప్రోటస్టెంటు శాఖలు ఈ సంఖ్యను అంగీకరించాయి. హీబ్రూ పూర్వవేదానికి
అనువాదమైన సెప్తువాంజిత్‌ గ్రీకు బైబుల్లో మరి 7 గ్రంథాలు అదానంగా జేర్చి
మొత్తం 46 పుస్తకాలు చేసారు. ఇది క్రీసుర్తపూర్వం 3వ శతాబ్దంలో తయారైంది.
ఈ యనువాదం కూడ ప్రామాణికమైంది కావడం చేత క్యాతలిక్‌శాఖ దీని సంఖ్యను
గ్రహించి పూర్వవేదగ్రంథాలు 46 అని శాసనం చేసంది.
         సెప్తువాంజిత్‌ బైబుల్లో అధికంగా వున్న గ్రంథాలు ఇవి. తోబీతు, యూదితు,
బరూక్‌, మక్కబీయుల గ్రంథాలు రెండు, సొలోమోను జ్ఞానగ్రంథం, సీరా జ్ఞానగ్రంథం.ప్రోటస్టెంటులు ఇవికూడ ఉపయోగకరమైన పుస్తకాలేనని
ఒప్పుకొంరు. కానివీటిని భగవత్‌ ప్రేరితమైన పుసకాలుగా మాత్రం అంగీకరించరు.
 

2. ప్రేరణం



క్రీస్తు అనుసరణం మొదాలైన భక్తిమంతమైన క్రైస్తవ పుస్తకాలు చాలా
వున్నాయి. వాటికీ బైబులుకీ ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి? బైబుల్లో భగవత్‌ ప్రేరణం వుంటుంది. ఇతర పుసకాల్లో ఈ ప్రేరణం వుండదు. ఈ ప్రేరణం వల్ల బైబుల్లోఅమోఘమైన ఫలశక్తి నెలకొని వుంటుంది. గ్రంథానని చదివేవాళ్ళకు ఆవక్తి లభిసుంది.
    కలాన్ని సాధనంగా వాడుకొని జాబు వ్రాస్తాం. అలాగే భగవంతుడు పరిశుద్ధా
రచయితను సాదనంగా వాడుకొని వాళ్ళచేత దివ్యగ్రంథాలు వ్రాయించాడు. ఇదేప్రేరణ -2పేత్రు 1,21. దివ్యగ్రంథాల్లోని భావాలు దేవునివి కనుక వాటి ప్రధాన రచయిత
                                                            1