పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

195

క్రొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి ధేంక్యూ” అన్నాను. రాజు నవ్వి వూరుకున్నాడు.

తరువాత నేను, రాజు మర్నాడుకాబోలు వూళ్ళో కెళ్ళి యూనివర్సిటీ, చూసి వచ్చాము. అది చూసి నేను ముగ్ధుడనై పోయాను. నోటమాట రాలేదు. యేదో మహత్తరమైన పవిత్ర భావములాంటి దేదో కలిగి స్తంభించిపోయాను. రెండు నిమిషాల్లో తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాసు గదులూ, లైబ్రరీ, పరీక్షాహాలూ, సభ జరిపే చోట్లూ, అధికారుల కచేరి గదులూ, అన్నీ చూస్తూంటే ఒకదానికంటే ఒకటి యెంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తలమునకలై యింటికి చేరుకున్నాను. ఆ సాయంకాలము నెమ్మదిగా రాజు నాకు ప్రయివేటు మాష్టరును కుదిర్చి పెట్టాడు. ఆయన నాతో యెంతో సావకాశంగా, నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంత వరకూ యెంట్రన్సు ప్యాసయ్యేటట్టు చేస్తానని అభయమిచ్చాడు. ముందు నీకు ఆంగ్లభాషాజ్ఞానం బాగా కలుగుతే తక్కినవన్నీ సుళువుగా వస్తాయన్నాడు. అలాగనే రోజుకు రెండుమూడు గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు. తక్కిన పాఠాలన్నీ ఓ రోజు కొన్ని, ఓ రోజు కొన్ని చెబుతూండేవాడు. యిలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది.

రెండ్రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి “గుడ్ మార్నింగ్ మిష్టర్ పార్వతీశం. మీకీ వేళ ఈ సుప్రభాతంతోటి, ఒక శుభ వార్త కూడా అందించ దలచుకున్నాను. ఇంటిదగ్గరనుంచి నిన్ననే ఊరగాయల బంగీ వచ్చింది. మీ వాటా ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడుపచ్చడి తీసుకొచ్చాను. హాయిగా తినండి” అని చక్కాపోయాడు. వాటిని యెంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చుని ఈవేళయెలాగైనా వీటిపని పట్టించాలని నిశ్చయించాను.

ఆ రోజు స్పెషల్ గా వంట ప్రయత్నం కోసం నేనూ వంటగది లోకి వెళ్ళాను. మీరొచ్చారేమిటీ వేళ మిష్టర్ సేమ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేం అని పిలవడం మొదలెట్టింది. పోనీలెండి మీ ఇష్టం ఎలా పిలిచినా సంతోషం అన్నాను. ఆ రోజున అప్పటి నుంచీ ఆ ఇంట్లో అందరికీ నేను సేంనే ఊరుకున్నాను.

“ఈ వేళ మా వూరినుంచి కొత్తగా వూరగాయలొచ్చినాయి. అందు కని వచ్చాను.” తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట