పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

బారిష్టరు పార్వతీశం

పడతాడు. అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుంద”న్నాడు రాజు.

ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కాననీ అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజూ, నేనూ కలిసి ఒక జాబితా తయారుచేసి యిచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ “ఇవన్నీ ఏం చెయ్యాలండి” అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెపుతాడు. ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచికూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి “ఇక నేను వెళతాను. మీకేం కావలసినా నన్నడగండి. నే చెబుతా” నన్నాడు. ఇక నే వెళతాను. గుడ్ లక్ మీకు శుభమవుగాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు.

ఇంటి ఆవిడ సామాన్లన్నీ తెచ్చి ఇవి “ఏం చేయాలో చెప్పం” డని అడిగింది “అన్నంవండగలవా” అన్నాను. “ఫరవాలేదు వండగల” నంది. “అయితే పప్పుకూడా కొద్దిగా నీళ్ళుపోసి ఉడకబెట్టి బాగా వుడికిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం వుప్పు వెయ్యాల”ని చెప్పాను. తరువాత కూరతరిగి వుడకబెట్టిన తరువాతను, పోపు వెయ్యడం యెలాగో చెబుతానన్నాను. కాని పోపు అనే మాటకి ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తరువాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. “నీళ్ళలో రెండు రకాల ముక్కలు వేసి ఉడకబెట్టా” లన్నాను. “ఓ, యూమీన్ సూప్” అంది ఇంతేకదా అది నేను చేయగలనంది. సరే కానీ తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకు వచ్చింది. పోపు వెయ్యడానికి నన్ను పిలవడం మరిచిపోయింది. పప్పు ఏ బద్ద కాబద్ద విడిగానే వుంది. పులుసులో చింతపండు వేయడం మరిచి పోయింది. యిది యెలాగు భగవంతుడా! తినడమనుకున్నాను. “నెయ్యి ఏది అన్నాను.” “నెయ్యేమి” టంది. “నాబొంద” అన్నాను. ఏమిటిఏమిటంది. మరేంలేదులే సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను ఆపూటకు అవి అక్కడ బల్ల మీద పెట్టి పుడ్డింగ్ అనబడేపాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లైపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ, పులుసులోనూ కూడా ఆవిడ వుప్పు