పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

189

వాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళయినా, పై వాళ్ళయినా, ఆడవాళ్ళు వస్తే ఈపైజామాలతో కనబడకూడదు. వాళ్ళు పై నుంచీ తలుపుకొట్టగానే చటుక్కున ఈ డ్రెసింగ్ గౌను తీసుకొని నడుంబిగించు కొని మరీ తలుపు తియ్యాలి. ఇంకో సంగతి. ఇంట్లో ఉన్నంత సేపూ మేజోళ్ళూ జోళ్ళూ తొడగనక్కరలేదు. కాని జపాన్ శాండల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పులు లాంటివీ, పలుచనివి, తేలికవి. వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవీ లేనిదే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి” ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనము చేసే లోపునే, ఒక పనిపిల్ల - పిల్లంటే పిల్ల కాదులెండి - ఓ ఇరవై ఏళ్ళుంటాయి.

లోపలకు వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచంమీద దుప్పటి తీసి, దులిపి మళ్ళీ వేసింది. గది అంతా తుడిచేసింది. తుడవడం కూడా వింతగానే ఉంది చీపురు పుచ్చుకోవడం, వంగుని తుడవడం, పద్ధతి లేదు. నాలుగైదడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిది దాంతోటి నిలబడే తుడవడం, చిత్రమేమిటంటే ఊరికే మర్యాదకు