పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

బసవపురాణము


(ఆ శాసనమున సంకగౌండఁడు సేనతో ఒంటరియగు నేకాంతరామయ్య పయికి యుద్ధమున కేఁగినట్లు ఓడినట్లు శివానుగ్రహమున నేకాంతరామయ్య గెల్చినట్లు చిత్రముగూడఁ జెక్కఁబడియున్నది) జైనులు తమ మతనాశనమునకుఁ గోపించి కళ్యాణమునకు వచ్చి దేశాధీశ్వరుఁడగు బిజ్జలుని యొద్ద మొరపెట్టుకొనిరి. బిజ్జలుఁడు వారి మాట విని యేకాంతరామయ్యపైఁ గోపించి యాతనిఁ బిలిపించి యడిగెను. ఆతఁడు జైనులు వ్రాసి యిచ్చిన ప్రతిజ్ఞాపత్రమును జూపెను. జైను లింకను బందెముకు వత్తురేని వారి జినాలయము లేడ్నూఱును దనతలఁ దగులఁబెట్టి యయిన వ్రచ్చివైపింతు ననియెను. బిజ్జలుఁ డప్పుడు నానాదివ్యస్థలములనుండి ప్రఖ్యాతులయిన జైనాచార్యులను బిలిపించెను. ఏకాంతరామయ్యతోఁ బందెమునకు నిలుఁడనెను. వారు నిలువరయిరి. బిజ్జలుఁడు వారి నపహసించి యిఁకమీఁద శైవులతో వివాదములు పెట్టుకొనకుఁడని మందలించెను. ఏకాంతరామయ్యకు సభలో జయపత్రము వ్రాసియిచ్చెను. ఆయన కాళ్లు గడిగి యారాధించెను. అప్పటినుండి యాసోమనాథునికి వీరసోమనాథుఁడని పేరయ్యెను. ఆ స్వామికి బనవాసి పండ్రెండువేలలో సత్లేజి డెబ్బది గ్రామములలోని దగు గోగేలి గ్రామమును బిజ్జలుఁ డప్పుడు దానము చేసెను. పిదప నాల్గవ చాళుక్య సోమేశ్వరుఁడు తన సేనాపతియగు బ్రహ్మనితో శెలయావచియ కొప్పయందు సభ చేసినప్పుడు శివభక్తుల కథలలో రామయ్య కథకూడ వినెను. ఉత్తరము వ్రాసి యేకాంతరామయ్యను బిలిపించి యాతఁడు తన యంతఃపురమున నాతని కాళ్లు గడిగి యారాధించెను. ఆ వీరసోమనాథదేవునకే బనవాసి పండ్రెండు వేలలోనే నాగరఖండము డెబ్బది గ్రామములలో నొకగ్రామము సమర్పించెను.

పిదప మహామండలేశ్వర కామదేవుఁ డక్కడి కరిగి యా కథలెల్ల విని యేకాంతరామయ్యను హానుగల్లు అను గ్రామమునకుఁ బిలిపించి కాళ్లు గడిగి యారాధించి (యావీరసోమనాథ దేవాలయమునకే హానుగల్లు 500 లలో హోసనాథ్ డెబ్బదింటిలో) ముండాగోడు దగ్గఱ మల్లిహళ్లి యను గ్రామము సమర్పించెను.