పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

బసవపురాణము


హిరియరదర్శన నయనక్కె చెలువు ;
సత్పాత్ర క్కిడువుదు హస్తక్కె చెంద;
సత్యవ నుడివుదు వాక్యక్కె భూషణ;
శివస్తుతి కేళువుదు కర్ణక్కె అలంకార ;
శరణరకూడె సంభాషణె ప్రాణకై శృంగార
ఇంతిల్ల దనరన బాళుహోలెయజోగికైయ పాత్రదిందకడె

156 పుట. కన్నడ కవిచరిత్ర

అని పాడి రాజ్యమును బరిత్యజించి కళ్యాణమున కేగి కట్టెలు కొట్టి అమ్ముకొనుచు జంగమార్చన చేయుచుండెను.

మోళిగమారయ్య వచనము లని కర్ణాటగ్రంథము గలదు.

ఏకాంతరామయ్య (పు. 170)

బసవపురాణమునఁ జెప్పఁబడిన విషయమే యీషద్బేదముతో నొకశాసనమునఁగలదు. దాని సారార్థమును జెప్పుచున్నాఁడను.

హనగల్లు కదంబులలోనివాఁడగు కామదేవ మహామండలేశ్వరుని దా శాసనము. అందు శాసనసంవత్సరము పేర్కొనఁబడలేదు. కాని, యీ కామదేవుఁడు క్రీ. 1181నుండి 1203 దాఁక రాజ్యమేలినాఁడు గాన శాసనమును దన్మధ్యకాలపుదయియుండును. బసవపురాణ రచనాకాలము శాసన రచనాకాలము నించుమించుగా నొక్కటే యగును.

“కుంతలదేశమున సోమనాథశివాలయము గల యలందిపట్టణమున వేదవేదాంగవేత్త శ్రీవత్సగోత్రుఁడు పురుషోత్తమభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు, ఆతని భార్యపేరు పద్మాంబిక. వారికిఁ జిరకాలము సంతానము లేదయ్యెను. పుత్రార్థమై వారు శివునారాధించిరి. సపరివారుఁడై కైలాసమున శంకరుఁడు సభదీర్చి యుండగా నారదుఁ డరుదెంచి, సిరియాలాదులు బొందితోఁ గైలాసమునకు వచ్చుటచేతను, కేశిరాజాదులు శివసాన్నిధ్యము నపేక్షించి భూలోకమును