పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

బసవపురాణము

బిజ్జలుఁడు జైనులను గర్హించెననియు శివుని కగ్రహార మొసఁగెననియు నుండుటచే శాసనకారుని యెఱుకలో నాతఁడు జైనుఁడు గాఁడనియే యున్నట్లేర్పడుచున్నది. ఈ శాసనము సరిగా బసవపురాణ రచనము నాఁటిది.

బసవనికాలమున గళ్యాణమునఁగల మిండజంగముల మిండఱికపుఁగథలు గొన్ని బసవపురాణమునఁ గలవు. సత్యముగా నట్టివి కొన్ని జరగినను జరగియుండవచ్చును. భక్తులు పరమేశ్వరులే యని, భక్తులచేయు తప్పులు తప్పులే కావని, భావించు పరమభక్తు లున్నప్పు డట్టిచర్యలు జరగుట కభ్యంతరమేమి. శైవభక్తుల కథలను బోలినవి వైష్ణవభక్తుల కథలు నిట్టివి యున్నవిగదా!

ఇట్లు చూడఁగా, మాహాత్మ్మములను బొగడు కథలు కొన్నిపోను, బసవపురాణమునఁ గానవచ్చు బసవనిచరిత్రమునఁ దక్కినదెల్ల దథ్యమనియే తలఁపఁగూడును. శాసనములందు బసవేశ్వరుని విషయము లేకున్నను దత్సమకాలమువాఁడగు నేకాంతరామయ్య విషయము గలదు గదా! ఆ శాసన మానాఁటి జైనశైవమతముల స్పర్థలను స్పష్టపఱచుచున్నది గదా! శాసనాదు లెందుకు? పండ్రెండవశతాబ్ది యుత్తరార్ధముననుండి నూఱేండ్లలోఁ గల్యాణప్రాంతములందుఁ గర్ణాటదేశమున బసవమతానుయాయు లసంఖ్యాకులుగా నతిశయించుట యొక్కటే బసవేశ్వరమతప్రాబల్యప్రాభవములకు బలిష్ఠమగు సాక్షి గాఁజాలును!

బిజ్జలుఁడు కలచురి వంశమువాఁ డగుట శాసనాదుల మూలమున స్పష్టముగా మనకుఁ దెలియవచ్చుచున్నది. కాని, సోమనాథుఁ డాతఁడు చాళుక్యవంశమువాఁడని చెప్పినాఁడు.

అల్లయ్య మధుపయ్య యను భక్తవరులఁ
బ్రల్లదుఁడై రాజు వఱపుడు నతని
యాయతైశ్వర్యంబు నతులప్రతాప
మాయుష్యమును భవిష్యద్రాజ్యరమయు