పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

బసవపురాణము


జెన్న బసవన్న యని కొడుకు గల్గినట్టు కలదే కాని, యామెకుఁ బెండ్లి జరగినదో లేదో, యామె యాకొడుకు నెట్లు గనెనో తెలియవచ్చుట లేదు. బసవన్న తండ్రితోఁ దగవులాడి యిలు వీడి వచ్చునప్పుడే యామెయు సోదరునితో నిలు వీడినది. బసవన యుపనయనము చేసికొననట్లే యీమె వివాహమును జేసికొనలేదా? ఈ సంశయమే కక్కయ్యగారి ప్రసాదపుఁగథకుఁ గారణమై యుండును. జైనులు శైవులు పరస్పరము ద్వేషము గలవారగుటచేఁ జెన్నబసవపురాణమున వీరొకకథను గల్పింపఁగా బిజ్జలరాయచరిత్రమున దీనికిఁ బ్రతికూలముగా వారొకకథను గల్పించిరి. చెన్నబసవపురాణమున నీలలోచన యను బిజ్జలుని సోదరిని బసవన పరిగ్రహించినట్లుండఁగా, బిజ్జలరాయచరిత్రమున బసవనసోదరి యగుపద్మావతిని బిజ్జలుఁడు పరిగ్రహించినట్టున్నది. మఱియుఁ జెన్నబసవపురాణమునఁ జిత్రకన్యకథ యని యసభ్యపుఁగథ యొకటి గలదు. అది యిది:- బిజ్జలునికి సౌందర్యవతియగు సోదరిగలదు. ఆమె గుఱ్ఱాలకాపరిని గూడెను. బిజ్జలున కది తెలిసెను. “బసవని సోదరియగు నాగమ్మ పెండ్లి లేకుండనే చెన్నబసవన్నను గన్నందుకు నేను బరిహరించితిని. దానికిఁ బ్రతిగా నాకే యిట్టి యవమానము దాపరించెను.” అని దుఃఖించి యాతఁడా గుఱ్ఱపుఁగాపరిని జంపించెను. చిత్రకన్యను జిత్రవధ చేయఁ దలారుల కాజ్ఞాపించెను. వారట్లు చేయుటలో నామె హస్తములు దెగి చెన్నబసవన్న యింటి వాకిటఁబడెను. అతిసౌందర్యవంతములుగానున్న యా హస్తములను జూచి మిండజంగము లచ్చెరువందిరి. ద్వారపాలకులు జరిగిన వృత్తాంతమును జెప్పిరి. మిండజంగములంత సౌందర్యవంతురాలగు నాచిత్రకన్యను జూడమైతిమి గదాయని వగచిరి. ఆమెను బ్రదికించి మాకుఁజూపు మని బసవనను బ్రార్ధించిరి. ఆమె శరీరశకలములెల్ల నేఱి తెప్పించి బసవన యామెను బ్రదికించెను. మిండజంగముల బులుపులు మెండయ్యెను. బసవన యామెను మిండజంగము లెల్లరకును భోగార్థమై నియోగించెను. అందఱు మిండజంగముల యాసలను దీర్పఁగాఁదగ్గసత్త్వము నామె కొసఁగెను. ఆ మిండగీం డ్రామెను దోడ్కొనిపోయిరి.”

ఈ రోఁతకథను జెప్పుటకుఁ జెన్నబసవపురాణకర్త వెనుకాడఁడయ్యెను. బసవనసోదరి యగు నాగమ్మచరిత్రమును గూర్చి జైను లాక్షేపింపఁగా వారికిఁ