పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

47


క. అసమేక్షణ! శివభక్తుం
    డసమశ్రేష్ఠుఁడని పలికి యన్యులతోడన్
    బొసపోరై బండారువు
    బసవన విసమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

క. వసుధ నుమేశుఁడె దైవము
    ప్రసాదమె పవిత్ర మీశుభక్తులె కులజుల్
    పొసపోరని బండారువు
    బసవన విసమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

క. కుసుమశరారీ! శివలిం
   గసమేతులు దక్కఁ బొందఁగా నిది నిర్మా
   ల్యసుఖంబని బండారువు
   బసవన విషమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

ఇది జరిగినను జరగియుండవచ్చును. పరతత్త్వము శివుఁడే యని త్రికరణశుద్ధిగా నమ్మిన మహాభక్తుఁడు, బసవేశ్వరుఁడు నిర్భయముగా నిస్సంశయముగా నిబ్బరించి లింగమూర్తిపై భారముచి నిజముగా విషము ద్రావి యుండవచ్చును. సంకల్పబలమున నీశ్వరానుగ్రహమునఁ జెక్కుచెదరక నిలిచి యుండవచ్చును. అది యసంభావ్యమని నేఁడు మన మనుకొనఁ బనిలేదు. ఉత్తమయోగ్యత లేవియు నుండకయే సీతారామనామకుఁ డొకయొడ్డీఁడు నేఁడు విషమును, గరఁగించిన సీసమును, నింక నెన్నింటినోకూడఁ దినుచు సర్వభక్షకుఁడని పేరంది నిరపాయముగా నుండుటను మనము వినుచుంటిమి; కనుచుంటిమి.

బసవన తోఁబుట్టువును బిజ్జలుఁడు పరిగ్రహించుటను గాని, బిజ్జలుని తోఁబుట్టువును బసవన పరిగ్రహించుటను గాని సోమనాథుఁడు వాకొనలేదు. అవి నమ్మఁదగినవిగా నాకు దోఁపవు. బసవన తోఁబుట్టువగు నాగాంబ భర్త లేకయే కొడుకును గనెనని చెన్నబసవపురాణము చెప్పుచున్నది గాని, యదియు నేఁటికింకను మనకసంభావ్యముగానే తోఁచుచున్నది. బసవపురాణమున నామెకుఁ