పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

43


ది దినములలో నీ కళ్యాణకటకమున శివద్రోహము పెంపొందఁగలదు. అప్పుడు శివద్రోహిని జంపుదునని నీ విప్పుడు మాటయిత్తువేని నీ యీతప్పిదమును శివుఁడు మన్నించును.” జగదేవుఁ డందుల కంగీకరించి వీరతాంబూలము గొనెను. బసవన భక్తులతో జగదేవునింటికిఁ బోయి భోజనము చేసెను.

బసవని మాహాత్మ్య మెఱిఁగియుఁ గాలము సమీపించుటచేఁ గొన్నాళ్లు సన్న పిదప, బిజ్జలుఁడు బసవమతమునఁ జేరిన యల్లయ్య, మధుపయ్య లనువారి నిద్దఱును బిలిపించి కారణమేదో తెలుపకుండనే కన్నులు పెఱికించెను. బసవన మొదలగువా రిఁక నీయూర నిలువరాదని నిశ్చయించుకొని జగదేవునిఁ బిలిచి 'యిదిగో, నీబాస చెల్లించుకోవలసిన సమయము వచ్చిన'దని చెప్పి కళ్యాణకటకము పాడగునట్లు శపించిరి. అప్పుడు మడివాలుమాచయ్య, చౌడరాయఁడు, ఏకాంతరామయ్య, కిన్నరబ్రహ్మయ్య, కేశిరాజయ్య, కన్నడ బ్రహ్మయ్య, కక్కయ్య మొదలగువారితో బసవన కప్పడి సంగమేశ్వరమున కేఁగెను. కటకము పాడుపడెను. అపశకునము లనేకములు దోఁచెను. జగదేవుఁడు మల్లయ బ్రహ్మయలను వారిర్వురు దోడురాఁగా నొకనాఁటిరాత్రి బిజ్జలునిఁ బొడిచి చంపెను. తర్వాత నాతఁడు దన్నుఁదాఁ బొడుచుకొని మరణించెను. పిదప బిజ్జలుని బిడ్డలు రాజ్యార్ధమై యుద్ధముచేసి మృతిఁజెందిరి. బసవన కూడలి సంగమేశ్వరమున సంగయదేవునిలోఁజేరెను.

బసవన చరిత్రము

(చెన్నబసవపురాణమునుబట్టి)

చెన్నబసవపురాణము ప్రధానముగా బసవన మేనల్లుఁడు చెన్నబసవనిచరిత్రమును దెలుపుచున్నది. కాని, బసవనిచరిత్రముగూడ నిందుఁగలదు. బసవనిచరిత్రము విషయమున నిది బసవపురాణముతోఁ గొంత వేర్పడుచున్నది. అందుఁ జెప్పఁబడని క్రొత్త విషయములను ముఖ్యభేదములను మాత్రమిక్కడఁజూపుచున్నాఁడను.

బసవని తోఁబుట్టువగు నాగమ్మకుఁ బెండ్లికాలేదు. భర్తలేకయే యామెకుఁ జెన్నబసవన్న పుట్టినాఁడు. బహుకాలప్రయత్నమున బసవన కక్కయ్యయను