పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

41



శివముద్దుదేవుండు సిక్కదేవుండు - శివరాత్రి సంగయ్య యవిముగతయ్య
చండేశుచామయ్య ముండబ్రహ్మయ్య - బండె [1]యరేవణ్ణ [2]యిండెసోమన్న
హాటకేశ్వరుని బ్రహ్మయ మహాబలుఁడు - కోటేశుచామయ్య గొగ్గయ్యగారు
దుమ్మదబ్రహ్మయ్య ధూర్జటికేశి - యెమ్మెసంగయ గపిలేశు విస్సయ్య
నొణిమేశుచిక్కయ నులుకచందయ్య - గణదాసిమాదన్న [3]గంటిమల్లయ్య
మురహాటకేతయ్య హరవిహొల్లయ్య - గిరిగీఁటు సింగయ్య గురజకాళవ్వ
బానసభీమయ్య భాస్కరయ్యయును - గోనియమల్లయ్య గొగ్గయ్యగారు
అల్లయ్యమధుపయ్య యనిమిషకేశి - హొల్లయ్య గోడలమల్లయ్యగారు
ఓలెబ్రహ్మయ కరహాళమల్లయ్య - బాలబ్రహ్మయగారు పణిహారిబాచి
కవిలెబ్రహ్మయ బందికారమల్లయ్య - యవకరకేతయ్య శివనాగుమయ్య
నిజలింగచిక్కయ్య నిర్లజ్జశాంతి - నిజభావుఁడును నిత్యనేమదమైలి
యంకబ్రహ్మయ గరహాళ బ్రహ్మయ్య - సుంకేశుబంకయ్య లెంకమంచయ్య
యేలేశుబ్రహ్మయ్య యీడెబ్రహ్మయ్య - మైలనబ్రహ్మయ్య మాయిదేవయ్య
చక్కెరబ్రహ్మయ్య శరణయ్యగారు - చిక్కబ్రహ్మయ్యయు సిరిగిరయ్యయును
వీరమారయ్యయు వీరలింగయ్య - వీరబ్రహ్మయ్యయు వీరభావయ్య
వీరనాగయ్యయు వీరకల్లయ్య - వీరభోగయ్యయు విమలదేవయ్య
[4]కక్కయ్యగల్లయ్య గాటకోటయ్య - చిక్కయ్య వీరయ్య శ్రీసూరసాని
కొండగుడ్కేతయ్య గుండయ్యగారు - చండేశుబ్రహ్మయ్య శంకరయ్యయును
అమృతదేవయ్యయు ననిమిషయ్యయును - విమలదేవుండును వీరాదిగాఁగ
శివభక్తిసంపదల్ సిలివిలివోవ - సవిశేషభక్తి దృష్టప్రత్యయములఁ
జూపుచుసద్భక్తి సురుచిరమహిమ - నేపారు వీరమాహేశ్వరావలికి.

కల్యాణపురమున బసవని బలఁగమును జూచి శివార్చకులు, పాశుపతులు మొదలగువా రనేకు లంతకుముందు లింగము లేనివారయినను నప్పుడు

  1. యుదే
  2. మిండ
  3. కరియ
  4. చిక్కబ్రహ్మయ్యయు శ్రీగిరయ్యయును - కక్కయ్య నల్లయ్య కాటకోటయ్య