పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం నమో వేంకటేశాయ

ముందుమాట

ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్.

కార్యనిర్వహణాధికారి,

తి.తి.దేవస్థానములు,

తిరుపతి.

శ్రీ వేటూరిప్రభాకరశాస్త్రిగారు జగద్విఖ్యాత శతావధానులగు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి శిష్యరికంలో సంస్కృతాంధ్ర సాహిత్యములను అభ్యసించారు. అపారమైన పాండిత్యాన్ని సంపాదించి సుప్రసిద్ధ పండితునిగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, బహుగ్రంథపరిష్కర్తగా ప్రసిద్ధిని పొందారు. మాస్టర్ సి.వి.వి గారి యోగసాధనలో సిద్దులై వారి యోగవిద్యతో వ్యాధిగ్రస్తులైనవారి నెందరినో రక్షించి వారికి ప్రాణభిక్ష పెట్టిన మహనీయులు. మహాతపస్వి.

శ్రీ శాస్త్రిగారు మొదట మదరాసులో తెలుగుపండితునిగా కొంతకాలం పనిచేశారు. పిమ్మట 1910 నుండి 1939 వరకు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో తెలుగు పరిశోధక పండిత పదవి నలంకరించారు. 29 సం॥ల కాలంలో వారు పరిశోధకులకు పంటపొలాలన దగిన అముద్రిత గ్రంథ వివరణసూచికలు (Descriptive Catalogues) 20 సంపుటాలు నిర్మించారు. శాస్త్రిగారు ఆ కాలంలో స్వయంగా 20కి పైగా ఉత్తమ పరిశోధన గ్రంథాలు పరిష్కరించి ప్రచురించారు. తర్వాత తి.తి.దే., ఓరియంటల్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. ఎంతోమంది శిష్యులను పండితులుగా తీర్చిదిద్దారు. వారికి జ్ఞానభిక్షను ప్రసాదించారు.

బహుముఖప్రజ్ఞాశాలి, ఉత్తమ పరిశోధకులు, ఆత్మదర్శనులు, నిరంతర యోగసాధకులు, కవి, రచయిత, శాసనపరిశోధకులు అయిన శ్రీ ప్రభాకర