పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

బసవపురాణము

పంచరత్నములు -ఆది :

ప్రియతమశివభక్తా బిందునాదానురక్తా
మయి భవ శివయుక్తా హారహీరప్రభాక్తా
నియమిత సకలాంగా నీలకంఠ ప్రసంగా
నయతు బసవలింగాధీనభక్తిక్రియాంగా.

అంతము :

శ్రీమతే వృషభేంద్రాయ సోమనాథేన ధీమతా.
పంచరత్నం కృతం స్తోత్రం జ్ఞానవైరాగ్యభక్తిదమ్.

బసవాష్టకము - ఆది :

జయజయ బసవాంశ సత్యసద్భక్తివాసా
జయజయ శివగోత్రా సత్ప్రసాదైకపాత్రా;
జయజయ భవదూరా శాశ్వతైకాంగవీరా
జయజయ బసవాఖ్యా సంవిదాశ్చర్యసౌఖ్యాం.

అంతము:

బస్వాష్టక మిదం పుణ్యం సర్వపాపప్రణాశనమ్;
యః పఠేచ్ఛృణుయా ద్వాపి శివలోకే మహీయతే.

కడమ కన్నడ రగడల కాద్యంతములు చూపకుండెదను.

సోమనాథుని పేరఁగల కృతులు

పిడుపర్తి బసవన పద్యబసవపురాణమును సోమనాథుని పేర నంకితముచేసినాఁడు. దానిఁగూర్చి యింతకుముందుఁ గొంతప్రస్తావము జరగెను. అన్యవాదకోలాహలమని పేరుగల సోమనాథలింగశతక మీతని పేరనే కలదు. అందు సోమనాథస్తుతియును, శివపారమ్యప్రతిపాదనమును, మతాంతరగర్హణమును గలవు. అది కర్ణాటకమునను గలదట. వీరశైవకవు లెల్లరు