పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

231

గాలకూటము శృంగి ఘనవత్సనాభి - హాలాహలంబును నాదిగాఁగలుగు
విషము లన్నియుఁగూర్చి వేగ నూఱించి - విషమతరంబగు విషసౌరభంబు
గాలి సోఁకినమాత్ర నోలి జంతువులు - వ్రాలి యచ్చటన జీవంబులు విడువఁ
బై నాకసంబునఁబాటువిహగ వి - తానంబు దొప్పన ధరఁబడి చావ
రాగిల్ల నూఱినఁబ్రేగులు దెగెడిఁ - ద్రాగిన బ్రదుకంగఁదా నెట్లువచ్చు
ననుచు నబ్బోయలు కనుకనిఁ బఱవ - ఘనఘోరగరళంబు లెనయంగఁగలపి
పసిఁడికొప్పెరల నిం పెసఁగఁగ నినిచి - యసమసద్భక్త సభాభ్యంతరమునఁ
గొప్పెర ల్దీయించి కూడ నర్పించి - యప్పుడు ధూపదీపాదు లొనర్చి
పంచమహావాద్యపటలంబు లులియ - సంచితకీర్తి బసవచక్రవర్తి
యా మడివాలు మాచయ్యయాదిగను - కామారిసద్భక్త గణలింగములకు
నతిభక్తి సాష్టాంగుఁడై ప్రణమిల్లి - చతురత సరససంస్తుతిపూర్వకముగ
ముద్రవుచ్చుడును విషోద్రేకవహ్ని - రుద్రుమూఁడవకంటి రౌద్రాగ్ని కరణి
భుగులుభుగుల్లనఁబొగలి కెంబొగలు - నెగయ విషార్చుల గగనంబుఁగప్పెఁ
బటువహ్నిగొని చెఱిపాఱె భానుండు - నిటయట పడియె నీరేడు లోకములు
భూలోకమెల్లఁగల్లోలంబు నొందె - వ్రాలి మూర్ఛిల్లె జీవంబు లన్నియును
నిల మంగలమునఁబ్రేలులు[1] సిట్లుగొన్న - పొలుపున ధరణిఁజుక్కలు ద్రెళ్లిపడియెఁ
పొగగొన్నమాత్రన దిగులు సొచ్చుడును - విగతచేతనులైరి దిగధీశులెల్ల
నిండె ధూమంబు బ్రహ్మాండమంతయును - గొండలు గాటుకకొండలై తోఁచె
బడబానలంబున జడధులు గలఁగె - నడరెఁగల్పాంతాగ్ని యని బ్రహ్మవడఁకె
నీలవర్ణంబు దా నెక్కొన్ననాఁటి - హాలాహలం బని హరి దల్లడిల్లె
గుత్తుకవిష మెట్లొకో పోయె వెడలి - నత్తఱి నని రుద్రుఁడతిభయంబందె
నెగసె రుద్రునిఫాలనేత్రాగ్ని యనుచు - నొగి గణాడంబరోద్యోగంబు దనరె
నేలయు నింగియు నెక్కొన నిట్టి - హాలాహలాగ్నిమయంబగు నంత
మా యీశుభక్తుల మహిమ లిన్నియును - బోయలార వినుండు బుడిబుళ్లు మాని
కంటిమి కానము వింటిమి వినము - నుంటిమి లే మను నుక్తులు వలదు
అరయంగ నఖిలలోకాలోకములను - బరమేశుభక్తులు పరమపావనులు
నద్వితీయుండు పినాకియే కర్త - సద్విధి నేమె ప్రసాదయోగ్యులము
నిట్టిద కాదనునట్టి ద్రోహులకుఁ - గట్టితి [2]నెఱిగెల్తుఁగాలకూటాగ్ని

  1. సిట్లినట్టి
  2. నొర, నెడ