పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

బసవపురాణము

నెన్నఁడే వీరమాహేశ్వరు లిండ్లఁ - గొన్నచోటులు దెల్పికొనుఁడ యిచ్చెదము
యారయ మును శైవు లైననునేమి - వీరమాహేశ్వరాచారు లైరేని
గనుకనిఁబ్రాణలింగప్రసాదంబుఁ - గొననిత్తురే మీకుఁగుటిలాత్ములార!
కొలాస లేల పైఁగొసరఁగుచంబు - గూలఁబడ్డ ట్లగుఁగూడనిమ్మనిన
[1]నేదియునేల మీ కిష్ట మేనియును - మా దేవునకును శ్రీ మన్మహేశునకు
బాలచంద్రప్రభా భాసురాంకునకుఁ - గాలకాలునకు మా నీలకంఠునకు
సర్పకుండలునకు సంగమేశ్వరున - కర్పింతుఁగాలకూటాదులు నేఁడు
రండ ప్రసాదంబు గొండ యిచ్చెదము - పొండ యింతకుఁజాలకుండి”న ననుడు[2]
“నక్కటా బసవయ్య! యందఱమమ్ము - నొక్క వెట్టునఁజంప నొండుపాయమునఁ
జాలక యిదిమేలు మేలు వో శృంగి - కాలకూటంబు మ్రింగంగఁబంచెదవు
నలి దీటుకొసఁగఁ బ్రాణంబు గల్గినను - బలుసాకు దిని యైన బ్రదుకంగ వచ్చు
నద్దిరా తాఁజచ్చి యది గుడ్తు రెవరు - దొద్దవో బసవయ్యతోడివాదంబు
వడిఁగొఱుకున కేఁగి బడిగంటఁజావఁ - బడిన మూషకములభంగి వట్రిల్లె
నేచి కొల్లకుఁబోయి యెదు[3]రెదుర్‌గాను - బైచీర గోల్పడ్డభావన దోఁచు
జాలిఁబడి కనకసాములు దమక - వేలిచికొన్న యావిధ మగుఁదమకుఁ
బగవారిబిడ్డల నగవులఁజంపు - పగిదిఁ జేసిన జోదు బసవనమంత్రి!
యీరసం బిదియేల యే మింతవెఱ్ఱి - వారము గామువో వలవ దిన్నియును
ధర భక్తు లెవ్వరే హరునకుఁదొల్లి - గరళ మర్పించుట గలదేని యిమ్ము
తవిలిచెప్పుము ప్రసాదంబని విషము - నెవరేని మునుగొన్న నేముఁగొనెదము
మేలిప్రసాదంబు మ్రింగ మీసాలు - కాలకూటంబు మాపాలె నేఁడింక
నెట్టిచ్చెదయ్య కీమాశుప్రసాద - మట్టవుఁబో విష మనియె యిచ్చెదవొ
నీవకో విషములు దేవుని కిచ్చి - చావకున్నను దత్ప్రసాదంబు మీర
చేకొండు వేయేల మీకును మాకుఁ - బ్రాకటంబుగ నింక బాస దా నిదియ
యనుడుబిజ్జలుఁడుభయానుమతమునఁ - జనుదెంచె దేవదేవుని గుడికడకు
బుడిబుళ్లునోవుచు బోయలు వచ్చి - రడరఁగఁదమకాకిపడగలు దూల

బసవన్న విషమారగించుట


బసవఁడసంఖ్యాతభక్తులుఁదాను - నసమానలీలమై నరిగియచ్చటను

  1. కాదేని శుద్ధలింగప్రసాదంబు, నేదియునేల
  2. నాఁడు, ఊరకుండుండు మీర లుర్వీశునొద్ద- వీఱిఁడిమాటలు విడఁబుచ్చి యనిన
  3. రుగుదురుగ