పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

227

యుత్తమాంగదకేశి హొన్నయ్య గండ - గత్తెర నాచయ్య గాలాగ్నిరుద్రి
శృంగి బొప్పయగారు [1]సిగురుచందయ్య - డింగరి మల్లయ్య సంగమేశ్వరుఁడు
కదిరె రెమ్మయ మహాకాళయ్యగారు - పదుమరసును బురాణదమాయిభట్టు
నుదరదరామయ్య యోగి దేవయ్య - యుదయమరసుగారు హొన్నయ్యగారు
ధవళయ్యగారు బొంతాదేవిగారు - సవరద [2]చిక్కయ్య సారెనాయండు
శివముద్దుదేవుండు సిక్కదేవుండు - శివరాత్రిసంగయ్య యవిముగతయ్య
చండేశు చామయ్య ముండ బ్రహ్మయ్య - బండి [3]యరేవణ్ణ [4]యిండె సోమన్న
హాటకేశ్వరుని బ్రహ్మయ మహాబలుఁడు - కోటేశు చామయ్య గొగ్గయ్యగారు
దుమ్మద బ్రహ్మయ్య ధూర్జటికేశి - యెమ్మె సంగయ గపిలేశు విస్సయ్య
నొణిమేశు చిక్కయ నులుక చందయ్య - గణదాసి మాదన్న [5]గంటి మల్లయ్య
మురహాట కేతయ్య హరవి హొల్లయ్య - గిరిగీఁటు సింగయ్య గురజ కాళవ్వ
బానస భీమయ్య భాస్కరయ్యయును - గోనియ మల్లయ్య గొగ్గయ్యగారు
అల్లయ్య మధుపయ్య యనిమిషకేశి - హొల్లయ్య గోడల మల్లయ్యగారు
ఓలె బ్రహ్మయ కరహాళ మల్లయ్య - బాలబ్రహ్మయగారు పణిహారిబాచి
కవిలె బ్రహ్మయ బందికార మల్లయ్య - యవకర కేతయ్య శివనాగుమయ్య
నిజలింగ చిక్కయ్య నిర్లజ్జశాంతి - నిజభావుఁడును నిత్యనేమదమైలి
యంక బ్రహ్మయ గరహాళ బ్రహ్మయ్య - సుంకేశు బంకయ్య లెంక మంచయ్య
యేలేశు బ్రహ్మయ్య యీడె బ్రహ్మయ్య - మైలన బ్రహ్మయ్య మాయి దేవయ్య
చక్కెర బ్రహ్మయ్య శరణయ్యగారు - చిక్క బ్రహ్మయ్యయు సిరిగిరయ్యయును
వీరమారయ్యయు వీరలింగయ్య - వీరబ్రహ్మయ్యయు వీరభావయ్య
వీరనాగయ్యయు వీరకల్లయ్య - వీరభోగయ్యయు విమలదేవయ్య
[6]కక్కయ్య గల్లయ్య గాటకోటయ్య - చిక్కయ్య వీర్య శ్రీసూరసాని
కొండగుడ్కేతయ్య గుండయ్యగారు - చండేశుబ్రహ్మయ్య శంకరయ్యయును
అమృతదేవయ్యయు ననిమిషయ్యయును - విమలదేవుండును వీరాదిగాఁగ)
శివభక్తిసంపదల్ సిలివిలివోవ - సవిశేషభక్తి దృష్టప్రత్యయములఁ
జూపుచు సద్భక్తి సురుచిరమహిమ - నేపారు వీరమాహేశ్వరావలికి

  1. శివకుమారుండు
  2. చక్కయ్యగారు
  3. యుదే
  4. మిండ
  5. కరియ
  6. చిక్కబ్రహ్మయ్యయు శ్రీగిరయ్యయును - కక్కయ్య నల్లయ్య కాటకోటయ్య