పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

బసవపురాణము

శివనాగుమయగారి శ్రీపాదములకు - భువి సమస్తాంగము ల్వొందంగ మ్రొక్కి
సన్నుత లింగపసాయితశస్త్ర - సన్నద్ధుఁడై మదిఁజెన్ను దుల్కాడ
సరస మాడినయట్లు పొరి నాగుమయ్య - కరతలాంభోజంబు గరములఁబట్టి
యొత్తుడుఁబింజించి యుడువీథిఁదాఁకి - యత్తఱి క్షీరధారావలి వర్వె
శివభక్తి కామధేనువు బసవనికిఁ - దవిలి చన్నవిసి యిబ్బువిఁగాఱునట్లు
కరుణించి శంభుండు గనకవర్షంబు - కరికాల[1]చోడుకుఁగురియించె నాఁడు
యసలార నేఁడు దివ్యామృతవృష్టి - [2]బసవనికిఁగురిసె భక్తవత్సలుఁడు
దుర్మలత్రితయ విధూతమైనట్టి - నిర్మలదేహంబు నిజ మట్ల కాదె
రుధిరమాంసాది నిరూపితంబగునె - యధమదేహులకుఁగాకని నరు ల్వొగడ
దివ్యామృతాంగ దీధితి దేజరిల్లెఁ - బ్రవ్యక్తమై జగత్ప్రత్యయంబమర
నఖిలభక్తౌఘంబు నసదృశలింగ - సుఖసమేతాత్ములై చూడ బిజ్జలుఁడు
నందందనాగి దేవయ్యపాదార - విందంబులకుఁజాఁగి వినమితుఁడగుచు
సకలలోకంబులు జయవెట్టుచుండ - నకుటిలభక్తిమై నంతంత మ్రొక్కి
యజ్ఞానజీవుల మపగతమతుల - మజ్ఞుల మధికగర్వాపరాధులము
శరణన్నఁగాచు మీబిరుదు నేఁడింకఁ - బరమాత్మ మఱవంగఁబాడియే యనుచు
శరణువేఁడుచు నున్న చండివిప్రులను - గరుణఁజూచుచు వారిఁగాంచి నవ్వుచును
బసవఁడుద్యత్సముల్లసనంబెలర్ప - నసమగజంబు నాగయ్య నెక్కించి
తానును బిఱుఁదెక్కి తననివాసమున - కానందలీల నొప్పారంగ నరిగె
శివనాగుమయగారి ప్రవిమలచరిత - మవిరళప్రీతి దుల్కాడంగ వినినఁ
జదివినవ్రాసిన సద్భక్తిమహిమ - లొదవు చతుర్వర్గపదములు సెందు

కళ్యాణపురమునఁ గల భక్తులు


(రుద్రునిమాఱట రూపంబు లనఁగ - భద్రేభసంహరు ప్రతినిధు లనఁగ
కళ్యాణమున నిత్యకల్యాణభక్తి - లౌల్యనిరర్గళ లాలిత్యముగను
మడివాలు మాచయ్య, మాదిరాజయ్య - బడవరబ్రహ్మయ్య, బాచిరాజయ్య
కిన్నర బ్రహ్మయ్య, గేశిరాజయ్య - కన్నడ బ్రహ్మయ్య, గల్లిదేవయ్య
మాళిగ మారయ్య, ముసిఁడిచౌడయ్య - శూలద బ్రహ్మయ్య సుఱియ చౌడయ్య
కలికేత బ్రహ్మయ్య గక్కయ్యగారు - తెలుఁగేసు మసనయ్య దెలుఁగు జొమ్మయ్య
శాంతదేవుండును జమ్మయ్య బాస - వంతుకేసయ్య యేకాంత రామయ్య

  1. చోడన్కి(డుకై)
  2. బసవన్కిఁ గురియించె