పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

బసవపురాణము

స్ఫుటచరణాబ్జ సంఘట రేణుపటల - ఘటితోత్తమాంగుఁడై ఘనహర్ష మలర
లీలఁదత్పాదసలిల సుధావార్ధి - కేళీవిలోలైక మేళనం బొలయ
ఘనతర దివ్యలింగ ప్రసాద సద - య నమోనమస్తే మహాలింగ యనుచు
శ్రీగురుప్రతిబింబ సిద్ధలింగోప - భోగోపభోగానురాగుఁడై మఱియు
నొలికిన డించిన యున్న ప్రసాద - మలరుచు ముంచి గంపల బండిఁబోసి
యప్రతిలీల గణప్రసాదంబు - సుప్రసన్నాత్మ నుత్సుకత దుల్కాడ
నెప్పటివినుకులు నెప్పటిచెన్ను - నొప్పారఁదెచ్చి గొబ్బూరిలోపలను
సుప్రసిద్ధముగఁ దా రాప్రసాదంబు - ముప్పొద్దుఁగుడువంగ విప్రవర్గంబు
బుడిబుళ్లువోవుచున్నెడఁనొక్కభక్తుఁ - డడరఁబండువుసేయ నయ్యూరిలోనఁ
బరితోషమతి బిబ్బబాచయ్యగారు - కరమర్థిఁదొల్లిటిక్రమమున నేఁగి
జంగమశ్రీపాద జలజసౌరభ్య - సంగతరుచిరోత్తమాంగుఁడై పొంగి
యలరుచుఁజెందుచు వలసినవన్ను - వలఁబ్రసాదామృత వనధి నోలాడి
నలి దీటుకొనఁదద్గణప్రసాదంబు - నిలఁజిల్కకుండ గంపల ముంచి పోసి
ముందటిక్రియ బండిముందట వెనుక - నందంబుగా నిట యట నటింపంగ
గొ[1]డగులు గొడగులు గూడి క్రిక్కిఱియఁ - బడగలుఁబడగలు ముడివడి వాల
మంగళారవములు మధురమై చెలఁగ - సంగీతరీతులు సరసమై యులియఁ
బాయక చాఁగు బళాయనురవము - ఘే యని యటుగూడి మ్రోయుచునుండ
బొబ్బలు వొడువంగ నుబ్బి యార్వంగ - బిబ్బబాచయగారు గొబ్బూరుసొరఁగ
వినఁబడె మున్నెల్ల వీరిదుర్జనత - కనుఁగొనఁబడియె నేఁడనుచు భూసురులు
నేతెంచి “హో నిలుఁడెందువచ్చెదరు - మీ తెఱం గిదియేమి మిగిలియున్నదియు
పెండ్లి [2]కేఁగుటొ యిట్లు బండ్లిదియేమి - దండ్లువచ్చెనొ మీఁదఁదల్లడంబేల
యంకాన కేఁగెద రార్పు బొబ్బలను - శంకరభక్తుండు నచ్చెనో యిట్లు
పోలంగఁగొంగనిఁబొడిచి వంగనిని - వ్రాలంగఁ దిగచితి రేల బింకంబు
సడగరంబులు వట్టిచాఁగుబళాలు - గొడుగులుఁబడగలు దడఁబడుటలును
జేరమవలె నొండె శివపురంబునకు - బోరన నిపుడేమి పోవుచున్నారొ
యక్కుమాలిన భంగి నగ్రహారంబు - చక్కన మీకెట్లు చనఁజేర వచ్చు

  1. డు
  2. కేఁగెదరేమి, కేఁగెదరిట్లు