పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము

213

దీనికి గురు వది దానిమహత్త్వ - మేనైన నొకనాఁటి కెఱుఁగ వెండియును
గారవింపఁగ మహా [1]కాళయ్యగారి - సారమేయంబును జంబూరిలోన
వాదంబునం దిట్లు వేదంబు సదివెఁ - గాదె యీ మర్త్యలోకం బెల్ల నెఱుఁగఁ
గాన విప్రులు భక్తగణములయిండ్ల - శ్వానంబులకు నెట్లు సరి యనవచ్చు
శివచిత్తుఁడన నొక్క శివభక్తిపరుఁడు - తవిలి విప్రులతోడి తర్కంబునందు
సకలవేద పురాణశాస్త్రపారీణు - లొకకోటివిప్రులు నొక్కభక్తునకు
సరియుఁగా రని వేదశాస్త్రంబులందు - విరచించి [2]చెప్పుడు ద్విజులంతఁబోక
చర్చలు సదువులు సమ్మతికలిమిఁ - గూర్చి యాడుట శబ్దకోవిదత్వంబు
కాన, యిన్నియు నేలకలదె ప్రత్యయము - దీని కింతయుఁజెప్పఁగా నేమి యనిన
విద్దెలాడుచుచున్న ద్విజులతో నొక్క - పెద్దభక్తునిచెప్పువెట్టి తూఁచుడును
నూరిభూసురు లెల్ల నొక్కటఁదూన్కి - రారైరి యాపాదరక్షకుఁ దొల్లి
కాన విప్రులు భక్తగణములచెప్పు - తో నైన నెనగారు వాన లేమిటికి

బిబ్బ బాచయ్యగారి కథ


గొబ్బూరిలోపల నిబ్బరంబుగను - బిబ్బ బాచయగారి పృథుమహత్త్వంబు
వర్ణింప శివునకు వశముగా దనిన - వర్ణింప నెంతటివాఁడ నట్లయ్యు
[3]నీ మాజనము వారిచే మున్నువడ్డ - బాములు సెప్పెద భూమీశ వినుము
జంగమలింగప్రసాదంబు దనకు - నంగంబుఁబ్రాణంబునై చరింపుచును
నగ్రహారంబులో నం దొక్కపాల - నగ్రగణ్యుఁడు నాఁగ నాశ్రమధర్మ
మతలోకపథవివర్జితుఁడౌచు వేద - మతభక్తిపథము సుస్థితిగా భజించి
యామట రెండు మూఁడామటఁబదిటఁ - గామించి ఘనదేవకార్యంబు లైనఁ
గర మర్ధి బాహుకంధరకర్ణవితతి - నురమున శిరమున నుపవీతముగ[4]ను
జెన్నొంద భక్తుల చెప్పులబిళ్ల - లున్నతి ధరియించి యొగి భస్మ మలఁది
బండియుఁబొణకయుఁబచ్చెనవెట్టి - బండి నెల్లెడ నందిపడగలు గట్టి
యెలమి దలిర్ప మువ్వలు నురుగజ్జి - యలు ఘంటలును నందియలు సామరములు
భాసురరుద్రాక్ష బహువలయములు - బాసికంబులు స్వర్ణపట్టము ల్వూన్చి
గోరాజమూర్తిఁగైకొన్న కుఱ్ఱలను - గారవంబున బండి గట్టి ముందటను
జాఁగు బళా యను శబ్దముల్ మ్రోయఁ - గాఁ గేళికలతోడఁగర మర్థి నేఁగి
శరణపదాంభోజ సంస్పర్శఫాల - సురుచిరభక్తిమై సొంపు నింపార

  1. కాళవ్వ
  2. చెపుడుదద్ద్విజు
  3. భూమీసురులు