పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

205

శ్రీరాముఁడును నట్ల సేతువు నిల్పి - శ్రీరామనాథు నర్చించుట వినమె
యాది క్షీరారామ మందు విష్ణుండు - గాదె రామేశ్వరుఁగడు నర్థిఁగొలిచె
ద్వారావతిని నిల్పి తాఁగొల్చెఁగాదె - కోరి గోవిందేశు గోవిందుఁడర్ధి
బ్రహ్మ యలంపూర భక్తితోనిల్పి - బ్రహ్మేశ్వరునిఁగాదె పాయక కొల్చె
నింద్రుండు పుష్పగిరీంద్రంబుమీఁద - నింద్రేశు నిడికాదె యెప్పుడుఁ గొలుచు
వారణాసిని నిల్పి వ్యాసుఁడుగాదె - కోరి వ్యాసేశ్వరుఁ గొల్చుసంతతము
ననయంబు వారణాసిని మునీంద్రులును - దనుజామరాదులు దమతమపేళ్ల
నొక్కొక్క లింగంబు నక్కడ నిలిపి - యక్కజంబుగఁ గొల్చు టది [1]దెల్లగాదె
యభవుఁడక్షయుఁడు మహాదాని దక్క - నభిమతార్థము నిచ్చు [2]నధిపులున్నారె
యవ్విష్ణుఁడాబ్రహ్మ యజ్జినముఖ్యు - [3]లెవ్వరే నెవరికే నిచ్చిరే పదము
హరివిరించిప్రముఖామరదైత్య - నరగరుడోరగవరమునీంద్రులకు
నీశ్వరుఁడొసఁగినయీప్సితార్థముల - శాశ్వతలీల సజ్జనసాక్షికముగ
నిచ్చిన సకలలోకేశ్వరుమహిమ - గచ్చరఁబడసినగణముల వినుము
చేతులు రెండు సంప్రీతిఁబూజింప - భాతిగాఁజేతులు బాణున కిచ్చెఁ
గన్నులు రెండు సమున్నతిఁబూన్పఁ - గన్నుల ప్రోవిడెఁగాళిదాసునకు
నాసక్తి శివనాగుమయ్యకుఁగన్ను - లేసోమవారంబు నెడపక యీఁడె
భానునిచేఁబోని లోని కుష్ఠడఁచి - పూని [4]మయూరుని మే నిచ్చెఁగాదె
హరిచేతఁబోని దుర్భరమైన కుష్ఠు - హరియింపఁడే దండి యర్థిఁగీర్తింప
భువిజనులెల్లను బొగడుచునుండఁ - దవనిధి దేడర[5]దాసయ్య కీఁడె
ధూపవేళను ఘంటతోఁ గొనిపోఁడె - యేపారమెచ్చి యోహిళుఁదనపురికిఁ
గరికాల [6]చోడుకుఁ గనకవర్షంబు - నరులెల్ల నెఱుగంగఁగురియించెఁగాదె
మిగిలినబాసకు మెచ్చి ప్రాయంబు - మగుడఁగ నీఁడె కుమ్మరగుండయకును
అక్కడఁబ్రమథులు నక్కజంబంద - నెక్కిన గద్దియ యీఁడె చేరమకు
నిమ్మవ్వకై యేడ్దినమ్ములు సూఱ - యిమ్ములఁబ్రమథలోకమ్మున విడఁడె
చెనసి బొమ్మయ్య చంపినమృగంబులను - ననయంబుఁగైలాసమునకుఁగొంపోడె
పూని యేడ్దినములపీనుఁగు బ్రదుకు - మానుగాఁగదిరె రెమ్మయ కిచ్చెఁగాదె
మలయరాజయ్య నిర్మల విమానమున - నలిగొన బొందితోనన కొనిపోఁడె

  1. నిక్క
  2. నధికు
  3. లెవ్వరెవ్వరికిచ్చి రేమేమిపదవి
  4. మయూరుకు
  5. దాసి కియ్యండె
  6. చోడన్కి