పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

201

కోయని శ్రుతియు 'నేకో రుద్ర ఉచ్య౽తే' యనుఁగాన మా దేవుండె కర్త
హరిముఖ్యులీశుఁబంచావరణములఁ - [1]బరి[2]చరులై కొల్చుపశువులు గాక
కర్తలే యొక్కొక్క కార్యకారణవి - వర్తన [3]మాత్రన వా రెట్టు లనినఁ
బనిసేయు [4]బంట్లెల్ల మును దమచేయు - పనికె కర్తలుగాక ఫలకర్త లెట్లు
కాన కర్తలకర్త మానీలగళుఁడు - దీనికి నిం కొండు దృష్టంబు లేల
పరమేశు చుట్టును ధర నూర నూరఁ - బరిచరులై హరిప్రముఖులు గొలువ
నప్రతిమాకారుఁడగులింగమూర్తి - కీ ప్రతిమాకారులే సమానంబు
నిర్మలనిత్యనిష్కర్మదేహునకు - దుర్మల దుష్ట దుష్కర్ములు సరియె
శుద్ధ ప్రసిద్ధానిరుద్ధ దేహున క - సిద్ధ బౌద్ధాశుద్ధ జీవులు సరియె
చావుఁబుట్టువులేని దేవదేవునకు - చావుఁబుట్టువుగల దేవత ల్సరియె
బ్రహ్మమాయాకారపశుపాశపతికి - బ్రహ్మేంద్రహరిముఖ్యపశువులు సరియె
శంకరునకు ధృతకంకాళునకును - శంకితు లగుచున్న కింకరు ల్సరియె(లెనయె
ప్రళయంబుఁబొందించు ప్రళయరుద్రునకుఁ - బ్రళయంబుఁబొందెడు పలువేల్పు
మునిగణార్చిత పాద వనజాతునకును - మునిశాపదగ్దులౌ పినుఁగులుసరియె
పూజితుండగు లింగపుంగవునకును - పూజించికొలిచెడి పూజరు ల్సరియె
సిరిమహాదేవుఁడౌసిరిగిరిపతికి - సిరివాసుదేవాదిసురలు సమంబె
నలిమూఁడుగన్నులుగల త్రినేత్రునకు - నలరెండుగన్నులయతగులు సరియె
హాలాహలాగ్ని సంహారశౌర్యునకు - హాలాహలాగ్నిహతాంగులు సరియె
త్రిపురదైత్యాంత కోద్రిక్త వీర్యునకుఁ - ద్రిపురదైత్యోపద్రవపతితు ల్సరియె
అంధకాద్యసురదర్పాపహారునకు - నంధకాద్యసురభయభ్రాంతు లెనయె
హరికమలజకపాలాస్థి ధారునకు - హరికమలజసురాసుర తతి సరియె
యావిర్భవింపని యభవున కరయ - దేవకీపుత్రాది దేవత ల్సరియె
లింగమూర్తికి జగత్సంగతాత్మునకు - లింగమధ్యములోని లెంగులుసరియె
సర్వజ్ఞుతోడ నసర్వజ్ఞు లెనయె - సర్వేశుతోడ నసర్వేశు లెనయె
షొడ్డలదేవుతో సోమేశుతోడ - సడ్డలదైవము ల్సర్చింప సరియె
హరుఁడు సర్వేశ్వరుం డభవుండు శివుఁడు - పరముఁడు పశుపతి పరమేశ్వరుండు
శ్రీమహాదేవుఁడన్నామంబు లున్న - వే మహినిటువంటి యితర వేల్పులకు(?)

  1. బరికరు
  2. వారమైకొల్చిబ్రదుకుదుర్గాదె
  3. ధారులైవర్తింతురెట్లు
  4. బంట్లుదాఁబదపడి