పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

బసవపురాణము

ధర జినబౌద్ధులు దైవంబులేని - నరరూపులై యుండుదురె మహత్తణఁగి
పశుకర్ములగు వేదబాహ్యులువారు - పశుపతు లగుదురె ప్రత్యక్షమిదియు
నననేల 'హస్తినాహన్యమానో౽ప్తి - యన [1]నిరీశ్వరుని విశ్వాలయుఁడనఁగ
నేనుఁగు వెన్కొని యెగిది [2]మట్టాడు - చోనైన వసదులు సొరరెట్టివారు
మాయ [3]దైవం బనుమాట లేమిటికి - మాయ దానట పేరు మఱి దైవమగునె
హరునధికారులు నజుఁడును హరియు - నరయంగ శ్రుతిబాహ్యు లాయున్నము
నెవ్వండు గర్త యీ యేవురియందు - నెవ్విదర్శనము లి ట్లెన్నఁగ నాఱు (గురు
శ్రుతి "ఏక ఏవ రుద్రో”యన్నయట్టు - లితరదైవంబుల నెన్న నేమిటికి
వేదంబు దైవమే వేయును నేల - నాదిసోమకుచేత నపహృతంబగునె
తలరునే పృథివియు దైవమేనియును - నిలయమై యుండునే మలమూత్రములకు
నెఱయ దైవమె నీరు నిట్టపాటులను - వఱలునె యణఁగునె యఱచేతియందు
ననలుఁడు దైవ మే నటు భంగపడునె - మును సర్వభక్షుఁడై చనునె లోకముల
నక్కరువలి దైవ మండ్రేని నొక్క - దిక్కున నుండునే దిక్పాలుఁడనఁగఁ
దలఁపఁనాకాశంబు దైవమండ్రేని - బ్రళయంబుఁబొందునే ప్రమథులచేత
నిలుకాల నిలువఁగ నేరక తిరుగు - నిల దినేశుండు సర్వేశ్వరుం డగునె
యానిశాపతి దైవ మన నెట్లువచ్చు - [4]నానాఁటికిని గళానష్టతఁబొందు
నఖిలంబునకుఁగర్త యాత్మయేనియును - సుఖదుఃఖములఁబొందిసొగయుచునున్నె
కావున మున్ని ట్లొకండొకొక్కటికి - దైవంబు లేనియుఁదారు వుట్టుదురె
కర్మంబ యంతకుఁగర్తయంటేని - గర్మం బచిత్తు దత్కర్తయు జడుఁడు
నెట్టన్న నన్యాయ మేమేనిఁజేయ - నట్టివానిఁబఱప నధికారి గలఁడొ
[5]తనకుఁదాఁబఱపునో తత్కర్మఫలము - [6]తనకుఁదాఁబంధించుకొనునొతత్కర్త
కావునఁబఱప నొక్కఁడు గర్తగలడు - భావనఁదత్కర్మఫలములు గుడుపు
నిలను గర్మాధీశుఁడీశుండు గర్మ - ఫలదాత మా యుమాపతియె దైవంబు
కర్మంబు గర్తయేఁగ్రతువునఁబుణ్య - కర్మి యంచును దక్షుఁగడతేర్పవలదె?
పితృవధసేసిన యతికర్మఫలము - నతని బొందఁగనీక యఖిలంబు నెఱుఁగ
మేటికర్మము గర్తమృడుఁడు గాఁడేని - కాటకోటని కేల కైలాస మిచ్చె
నటు 'కృతం కర్మ శుభాశుభం' బనెడి చిటిపొటివాదము ల్సెల్ల వెయ్యెడను

  1. ఁగనీశ్వరుని
  2. ముట్టాడు
  3. యెదైవమన్మాట
  4. నానాటికి పుడును నష్టంబుఁ బొందు
  5. తనుఁదాన
  6. తనుఁదాన