పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

199

శంకరదాసయ్యకథ

భక్తులయాజ్ఞలోపలివాఁడు హరియు - భక్తు లల్గినఁజెడు బ్రదుకుఁగూర్చినను
ధరణి నెట్లన్న శంకరదాసి యనఁగఁ - బరికింప రెండవఫాలలోచనుఁడు
ఇట యల్గిచూచిన నితరదైవంబు - లటవ్రయ్యలై పడు నన్యదర్శనులు
తొల్లియు జగదేకమల్లఁడన్పెద్ద - బల్లహు నొద్ద సంపాదన సేయ
బిలిబిలి పరసమయులు దల్లడిల్ల - నలిగి శంకరదాసుమయ్య సూచుడును
ఫాలకరాళవిశాలనేత్రాంత - కీలావళీస్ఫురత్కాలాగ్ని గ్రమ్మఁ
గ్రక్కున నచటి నారాయణప్రతిమ - వ్రక్కలయ్యెనుగాదె వసుధ యెఱుంగ
నరయ శూన్యాలయంబై యున్నయట్టి - తిరుముట్ట మది దాన కరిగాదె చూడఁ
గావున మా [1]భక్తగణములమహిమ - నీ వేమియెఱుఁగుదు నిఖిలేశ్వరుండ
యననేలవేయు నట్లైన బాచరసు - ఘనమహత్వముసూతుగాదె తొల్లియును
యణకించి పలుకఁ దత్‌క్షణమాత్ర నీవ - ప్రణుతింప సోమేశు రప్పించుకొనఁడె
[2]కొట్టరువునఁబళ్లు గోటానకోట్లు - పెట్టియు మనుజులపేళ్ళు వ్రాయండు
కదియఁబంచాక్షరి కవిలియవ్రాసి - చదువు లెక్కలు [3]వెర సది దప్పకుండ
నెఱుఁగుదుగాదె మున్నేఁజెప్పనేల - యెఱుఁగుదుగాకేమి యిటమీఁదిపనులు”
నంచును వృత్తాంతమంతయుఁ బసవఁ - డంచితమతి విన్నవించి పుచ్చుడును
'వాద మన్నను బోవవలయుట తగవు - గాదె' యంచును సముద్గతకోపుఁడగుచుఁ
జనుదెంచి భక్తులఁగని మ్రొక్కి నిలువ - జననాథుఁడాగ్రహంబున నిట్టులనియె
“నరుదగు నఖిలలోకాధీశుఁడైన - హరిప్రతిష్ఠకు నమాత్యవ్రాతమెల్లఁ
జనుదేర నీవేల చనుదేర విచటి” - కనుడుఁగోపోద్దీపితాంగుఁడై పొంగి
“పుట్టఁ జుట్టువుమాలి చుట్టుముట్టాడు - నిట్టిట్టివేలుపు లెట్టునరేంద్ర!
కర్తలనియెదవు కర్తలిం దెవరు - కర్తలకర్త మత్కర్తయ కాదె
కర్తవ్య మింతయుఁగర్త శంభుండు - కర్తవ్య మెందును గర్తకు సరియె
కర్తప్రధానుండు గాక తక్కెల్లఁ - గర్తయు హర్తయుఁగలఁడె వేఱొకఁడు
హరియును గిరియును నజుఁడును గిజుఁడు - సురలును గిరలును హరునిసమంబె
యిల 'మమ కర్తా మహేశ్వర' యనుచుఁ - బలికెడు విష్ణుఁడు పరమేశుఁడగునె
యటుగాక స్థితికర్త యందమే విష్ణుఁ - డిట పుత్రు రక్షింప నేలొకో లేఁడు
నలువ దైవంబనుపలుకులు మున్నె - పొలిసెఁగాదే తల [4]వొలిసినయపుడు
కాఁడువో యుత్పత్తికర్తయు నజుఁడు - పోఁడిగాఁ దనతలఁబుట్టించుకొనఁడె

  1. శివ
  2. కొట్టారమున
  3. వెరుసది
  4. పోయిన