పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

బసవపురాణము

జను లద్భుతం బంది వినుతింపనట్ల - యనయంబు వర్తించుచును రూఢి వెలయ
నక్కజం బందఁగ నన్యదర్శనుల - ముక్కుపైఁగత్తియ న్టెక్కె మప్పురిని
నెత్తించి 'వీరమాహేశ్వరపదమె - యుత్తమ మీశ్వరుఁడొక్కండె కర్త'
యని ప్రతిష్ఠింపంగ నన్యదర్శనులు - చని యంత వారణాసిని గదాధరుని
గుడిసమీపంబునఁగూర్చుండి గర్వ - మడరఁ దర్కోన్ముఖులై పిలిపింపఁ
బసిగమై మంచెనభట్టారకుండు - నసదృశమహిమ దుల్కాడ నేతేర
సమయులు దమతమశాస్త్రంబు లెత్తి - భ్రమగొని యొక్కొక్కప్రశ్న సేయుడును
నయ్యయి శాస్త్రసూక్త్యర్ధంబులందు - నయ్యయి సమయుల కియ్యకోలుగను
నిపుణతమై సకలపురాణశాస్త్ర - విపులార్థవాదము ల్విఖ్యాతి వెలయఁ
జూపుచు వెండియు శ్రుతిసంహితాది - రూపితార్థంబుల రూఢిగాఁబ్రశ్న
సేయుడు లెంక మంచెనపండితులకు - నాయెడ సమయులు వాయెత్తనోడి
“చదువులు గిదువులు సాలుఁబో”వేయు - [1]నదియేల దృష్ట మే మయినను గలదె
యనవుడుఁ దనక తా నరుగ నవ్విష్ణుఁ - గొనిపోయి విశ్వేశ్వరునకు మ్రొక్కింతు
నింకఁ"జూడుం డంచు లెంకమంచెయ్య - యంకించి నరు లెల్ల నటు ప్రస్తుతింప
మారారి సద్భక్తమండలిఁదలఁచి - "యోరోరివిష్ణు! [2]నీకొడయఁడైనట్టి
విశ్వేశునకు మ్రొక్క వెడలి ర”మ్మనుడు - నశ్వరపరదర్శనస్థులు వడఁక
శ్రీరమణుండు మంచెన పండితయ్య - గారి యానతికిని గడగడ వడఁకి
మ్రొక్కుచు నత్తిరుముట్టంబు వెడలి - చక్కఁదెర్వునఁబాదచారియై నడవ
శివలెంక మంచెయ్య శివభక్తవితతి - దవిలి ముందట మహోత్సవలీలఁజనఁగ
నగ్గదాధరువెన్క నన్యదర్శనులు - నగ్గలికము సెడి యరుదెంచుచుండ
నక్కజంబుగ నటు హరిఁగొనివచ్చి - మ్రొక్కించె విశ్వేశ్వరునకు మంచెయ్య
భువి“శివభక్తః ప్రభు ర్మమ” యనఁగ - నవిరళంబయ్యెఁగేశవునివాక్యంబు
మంచెనపండితు ల్మఱి తన్నుఁబిలువఁ - 'బంచినపని సేసి బ్రదుకుదు' ననుచుఁ
జక్కనఁజనుదెంచి మ్రొక్కె నంతటను - 'జిక్కె' నంచును గూడి శివభక్తు లలర
“నదిగాదె నేఁడును హరి విశ్వనాథు - నెదుర మ్రొక్కినయట్టు లీల నున్నవాఁడు
నేవాదులును విష్ణు లేవంగనెత్తఁ - జూవె చాలక యిట్లు సూచుచున్నారు
హరునకుఁబ్రతిలేమి యన్నియునేల - ధరఁజాఁగఁబడియున్న హరిరూపసాక్షి

  1. నిదియేలదృష్టాంత (మిటుచూపగలవొ) మేఁజూపఁగలదె.
  2. కృష్ణ