పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

5

అని హరిదేవాచార్యుని, వృషభస్తుతి నెఱపిన సోముని, పద్మరసును స్తుతించినాఁడు. ఈ సోమరాజు తన గ్రంథరచనాకాలము నిట్లు చెప్పుకొన్నాఁడు:

మ. జననాథోత్తమ సోమరాజను సిర్దీ కావ్యం వలం శాలివా
     హన శాకాబ్దమదెయ్దె సాసిరదనూఱిం సంద నాల్వత్తు నా
     ల్కనె యారంజిత చిత్రభానువ వరాశ్వీజోత్సితైకాదశీ
     వనజాతారి తనూజవాసరదొ ళాదత్తల్ల మంగర్పితం.

శక.1144 (క్రీ.1222) లో నది రచితమయ్యెను. పాల్కురికి సోమనాథుఁడీ కాలమునకుఁ బూర్వుఁడు గావలసియున్నాఁడు. కర్ణాటకవిచే స్తుతింపఁబడిన సోముఁడు వేఱొకఁడు గావచ్చుననఁగాదు. వృషభస్తుతి నెఱపిన సోముఁడితఁడే కాని వేఱొకఁడు లేఁడు. బసవపురాణాది గ్రంథరచనముచే క్రీ. 1200 నాఁటికి సోమనాథుఁడు ప్రఖ్యాతి కెక్కియుండెనని యిది చెప్పుచున్నది.

సోమరాజకవి సోమనాథుని స్తుతించుటచేతనేకాక మఱికొన్ని సాధనముల చేతఁగూడ సోమనాథుఁడు రుద్రదేవునికాలము (క్రీ 1198 వఱకు) వాఁడనియే యేర్పడుచున్నది.

“జంగమరత్నంబు శరణసమ్మతుఁడు, లింగైక్యవర్తి గతాంగవికారి
పండితారాధ్య కృపాసముద్గతుఁడు, మండితసద్భక్తి మార్గప్రచారి
విలసితపరమ సంవిత్సుఖాంభోధి, నలిఁ గరస్థలి సోమనాథయ్యగారు.”

మొదలగు భక్తులను వేఁడి బసవపురాణ కథావృత్తాంతమును దాను దెలిసికొన్నట్లు సోమనాథుఁడు బసవపురాణమునఁ జెప్పుకొన్నాఁడు. మీఁది ద్విపదలలోఁ గరస్థలిసోమనాథయ్య 'పండితారాధ్యకృపాసముద్గతుఁ'డని కలదు. పండితారాధ్యులవారి శిష్యుఁ డనియేని, లేక తదనుగ్రహమున జనించినవాఁ డనియేని దాని కర్దమగును. తచ్ఛిష్యుఁ డనుటే యుక్తతరము. పండితారాధ్యుఁ డనఁగా మల్లికార్జున పండితారాధ్యుఁడే. ఆయన శిష్యుఁడయిన కరస్థలి సోమనాథయ్యకుఁ బాల్కురికి సోమన సమకాలమువాఁడని దీనివలన నేర్పడుచున్నది.

పండితారాధ్యులవారు బసవేశ్వరుని దర్శింపను గళ్యాణకటకమునకుఁ బ్రయాణమై వచ్చుచుఁ ద్రోవలో వనిపురమనుగ్రామమున నుండఁగా నాఁటి కెనిమిది