పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

బసవపురాణము

క్ష్మాతలేశుఁడు శిరఃకంపపూర్వముగఁ - జేతులు రెండును శిరమునఁదాల్ప
వారక జయజయధ్వనులు ఘూర్ణిల్ల - పౌరజనములు విభ్రాంతులై చూడ
నవికలసకలవాద్యధ్వను ల్సెలఁగ - వివిధ నాటకమహోత్సవము లొప్పార
వలచేత నలుఁగు డాపలిచేత శిరము - దులుకాడ వీథివీథుల మెఱయుచును
జతులు వెట్టఁగఁదాళగతుల కాడుచును - క్షితిఁగటారముమీఁదఁజేరినిల్చుచును
శరణార్థిసేయుచు జయవెట్టుఁడనుచుఁ - బిరిగొని యార్చుచుఁబెడబొబ్బ లిడుచు
నిప్పాటఁగలయంగ నేడుదినంబు - లప్పురి మెఱసి యేకాంతరామయ్య
వచ్చి యప్పరు[1] గుడివాఁకిట నిలిచి - "వచ్చెనా బాస శ్రవణులార!" యనుచు
నేకాంగవీరుఁడలోకానుసారుఁ - డేకాంతరాముఁ డపాకృతకర్మి
చక్కన శిరమట్ట సంధింపఁదడవ - నొక్కింత కొకదెస కోరవో యుండె
'హరుఁడు వేల్పగుట కేకాంతరామయ్య^ - శిరములోకులకెల్ల గుఱి' యన్నయట్లు
ఏకాంతరామయ్య శ్రీకరమహిమ - లోకాంతమయ్యెఁద్రిలోకంబులందుఁ
[2]బ్రత్యక్ష మీతఁడే పరమేశుఁడనుచు - నత్యద్భుతాక్రాంతులై జను ల్వొగడ
'గడుదురాత్ములఁజూడఁగా దని తమకుఁ - బెడమొగం బిడె' నని భీతిల్లినట్లు
జనపాలుకునిచేత జయపత్ర మిచ్చి - జినసమయులు వచ్చి శివభక్త వితతి
ముందటిదెసఁజాఁగి మ్రొక్కఁగఁబడిన - యందఱిమొగములయం దచ్చులొత్తి
యారిచి పెడబొబ్బ లందంద యిడుచు - వీరమహేశ్వరవితతి యుప్పొంగి
వెనుకొని వసదుల విఱుగఁ గొట్టుచును - జినప్రతిమల తలల్చిదిమివైచుచును
నసమానలీలఁగల్యాణంబునందు - - వసదియు జినుఁ డనువార్త లేకుండఁ
గసిమసంగుచుఁజంపి గాసివెట్టుచును - వసుధలో జిను లనువారి నందఱను
నేలపాలుగఁజేసి నిఖిలంబు నెఱుఁగఁ - గాలకంధరుభక్తగణసమూహంబు
అనుపమశౌర్యు నేకాంతరామయ్య - ననురాగలీలమైఁగొనియాడుచుండ
ననయంబు బసవఁడు దనసంగమేశుఁ - డని భక్తిఁగొల్వ నేకాంతరామయ్య
వరకీర్తిమై నిట్లు వర్తింపుచుండె - ధర లసద్భక్తివిస్ఫురణమై మఱియుఁ
బ్రథితుఁడీ యేకాంతరామయ్య దివ్య - కథ విన్న వ్రాసిన గారవించినను
జల హాలహల వహ్ని శస్త్రాస్తబాధ - నలి నాగ మృగ రోగములభయంబణఁగు
విపులదృష్టాదృష్టవివిధ సౌఖ్యములు - నపవర్గములు గల్గు హరుకృపఁజేసి

  1. యెప్పటి
  2. ప్రత్యయ