పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

191

నాఁటి [1]లింగము నేఁడు నవసెనే చెపుమ - నాఁటి[2]భక్తమహిమ నవసెనే నేఁడు
చిటిపొటిసమయంబు లిటువంటి వడఁప - నట వెద్దలేల నే మైనఁజాలుదుము
గబ్బున జైనమార్గమె యాది యనుచు - నిబ్బంది జినమును లీ యబ్బలూర
మెట్టి మాతోఁబ్రతిఘట్టించి యాడ - నెట్టణ వాదంబు నిల్చి గెల్చినను
“నటువోవ దింకఁబ్రత్యక్షప్రమాణ - మిటు సూపుమా” యని యటు ముదలింప
“హిరియవసదినాఁగఁ బురినెన్నఁబడ్డ - యురుజినాలయ మినుఁడుదయమౌనంత
లోనన గోడలతోనన కూలి - తానపు మీ వేల్పుతలయును బగిలి
నేలపాలయ్యెనేనియు నీశుబంటఁ - జాలుఁబో యిదియ దృష్టముచూడుఁ”డనుచు
వచ్చినంతటిలోన వసదియుఁగూడ - వ్రచ్చి వందఱ లాడువడువునఁద్రెళ్లె
జినరూప మంతఁదుత్తునియలైపడియె - జనులు జైనులును నాశ్చర్యంబు నొంద
నిలువ దప్పురిఁగూలు నేఁడును వసది - యిలయెల్ల నెఱుఁగరే యిన్నియునేల
ముదిలంజెపడు పట్లు ముందటికథలు - పదరి చూపఁగలేని [3]పందవే నేఁగు
వరకీర్తి మొఱటద వంకయ్యగారి - వరవుడఁ బిఱుసనవచ్చునే నాకు
యిప్పుడ శిరమిచ్చి యేడుదినంబు - లిప్పురవీథులనెల్లను మెఱసి
తలవడయుదు ధరాస్థలియెల్ల నెఱుఁగ - దలతలచూడను గలదురా శక్తి
యటమీఁదఁగళ్యాణకటకంబునందు - నటయిట మందునకైన లేకుండ
వసదు లన్నియు వ్రచ్చి వందఱలాడి - వెస జినప్రతిమల విసమాల్తు నిదియు
బాస మిమ్మిరుగాలిపసుల నింకొండు - చేసిన నిం కొండు సిద్ధియుఁగలదె”
యనవుడు"నట్లకా”కని యొక్కదెసను - జీనసమయస్థులు సేరిచూడంగ
బసవఁడు సహితంబు భక్తనికాయ - మెసకంబుతోఁగొలు విచ్చి కూర్చుండ
నా బిజ్జలుఁడు దంత్ర మప్పురాంతరము - నా బాలవృద్ధాదు లంతంతఁజూడ
నచ్చెరువంద నేకాంతరామయ్య - కచ్చించికొని యంకకాఁడునుబోలె
దరహాసకాంతి వక్రమునఁదుల్కాడ - నరుదొంద భక్తగణాళికిమ్రొక్కి
యార్చి బొబ్బిడిపొంగి యలుఁగు గంఠమునఁ - జేర్చి క్రుమ్ముడి యొక్క సేతసంధించి
యాసురంబుగ నల్గ నప్పుడట్టకును - బాసి శిరము కేల “బాపు బా” పనఁగ
బసవఁడు గీర్తింప భక్తసమూహ - మసమానలీలఁగో యని పొంగియార్వ

  1. నిష్ఠయు
  2. భక్తి
  3. పందనేనేను