పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

189

“బాసోసి వైజి! తాపసి యెం దణంగె? - గాసిపడక చూపు క్షపణులచేతఁ
గన్నంతటను జూడఁగాదను తపసి - కెన్నెదల్ గల్గె నీకిటు గుడ్వఁబెట్టఁ
గూడునే తనయిల్లు వాడు సేసితివి - యేడ దాఁచితి చెప్పు బూడిదగొట్టు
మగనియాజ్ఞకు మీఱఁదగునె యి ట్లేమి - తగులమో కాక యత్తపసికి నీకు
సమ్మతంబగునేని చను” మని యతివ - సమ్మెటఁగొని చాటుచాటున వ్రేయ
నతివయు లెక్కసేయక శివుఁదలఁపఁ - బతి వ్రేయు వేట్లెల్ల సతిమీఁదఁబడక
పిట్టారగింపంగఁబెట్ట శంభుండు - పిట్టవ్వకై రాచవెట్టికిఁబోయి
సోలుచుఁగ్రాలుచుఁబ్రేల[1]గింపుచును - నాలంబు సేయుడుఁగోలలవారు
నలుకమై 'వడుగ! పొమ్మని వ్రేయువ్రేట్లు - కలయఁజోడని నియోగముఁదాఁకినట్లు
వసదులు నిండఁగ వాడలనడుమ - మసలిన తమ జైనపసులను దాఁక
త్రట్లను గట్టి ముచ్చుట్లును జుట్టి - వ్రేట్లతోడన తమవీవుతో ళ్లెగయ
నులికుల్కి వీఁగి వీపులు విర్చుకొనుచుఁ - గెలకు లారయుచుఁజేతులు నొగ్గికొనుచు
నుఱికుర్కిపడుచు [2]దబ్బఱమానుఁడనుచు - వెఱవేఁకు లందుచు విభ్రాంతు లగుచు
హోయని జడియుచు నుపతపించుచును - వాయెత్తి యేడ్చుచు వసదు లెక్కుచును
నందుండి యుఱుకుచు నైదవెట్టుచును - సందుల కేఁగుచుఁగ్రిందు సొచ్చుచును
చెఱవులమునుఁగుచుఁజెట్లఁబ్రాఁకుచును- బఱచుచునొండొరుమఱువుసొచ్చుచును
వ్రేట్లకు నులుకుచు విహ్వలు లగుచుఁ - ద్రట్లంటి చూచుచుఁ 'దమకర్మ'మనుచు
జినువెన్క డాఁగుచుఁ 'జిక్కితి'మనుచుఁ - గనుకనిఁజనుచు 'నెక్కడ సొత్తు' మనుచు
'వచ్చెఁజా'వనుచు'దైవమెఱుంగు'ననుచు - 'నొచ్చితి'మనుచును వెచ్చనూర్చుచును
దలలు గుండులతోడఁదాఁకించికొనుచు - నిలఁబడి పొరలుచునెట్లోకో' యనుచుఁ
దొరిగెడి మేని నెత్తురు లంటియంటి - పొరిఁబొరిఁజూచుచుఁ'బొక్కితి' మనుచుఁ
'జొరఁజోటు'లే దంచు సొమ్మసిల్లుచును - 'హరుకృత్యమో కాక' యనుచు నిబ్బంగి
సంతాపమున వ్రేట్ల జైనులు వొరల - నంతలో నొకబుద్ధిమంతుఁడీక్షించి
“చాటున నొకవ్రేటు సతి వ్రేయఁజాటు - చాటున నీ జైనకోటిఁదాఁకెడిని
యక్కజంబుగను నినాంశులు వోలె - నొక్కొక్క వ్రేటు వేయు ముఖముల్గాఁగ
శ్రీచంద్రమునివోయి చెఱువుపాలయ్యె - నాచార్యముని వోయి యగడితఁబడియె
వరచంద్రమునివోయి వసదెక్కి యుఱికె - నరహతముని వోయియడవులఁగలసె

  1. రొప్పు, రించు
  2. నబ్బుర మిదియనుచు