పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

బసవపురాణము

వలగొని సర్వాంగములును సంధిల్ల నిలఁజాఁగి మ్రొక్కిన "నింక లే చాలు
జినుఁడు ప్రసన్నుఁడై తనుఁగొల్వనిచ్చెఁ - బనిలేదు మా బుద్ధిగొని యిటబ్రదుకు”
మనవుడు సోమన్న యాగ్రహంబంది - "జినునికి గినునికిఁజేతు లెత్తుదునె
చా, పన్నలార! సాక్షాల్లింగమూర్తిఁ - జూ పెద రం” డంచు లోపలి కేఁగి
కన్నులఁగట్టిన [1]కవణంబు వుచ్చి - మున్ను లేచుచు బల్మిఁగన్నులు దెఱవ
నటమున్న జినరూప మటయట పాసి - పటపటఁబగులుచు నిటయటవడఁగ
నిటలతటానలోత్కటచటులాక్షుఁ - డట జినప్రతిమమధ్యంబున నిలిచె
ఖ్యాపితార్వాచీనరూపంబు దనర - గోపతివాహనుఁడేపు [2]దలిర్ప
సురహొన్న వసదిన సోమేశుఁడనఁగఁ - బరగె మా సోమన్నభక్తికి మెచ్చి
ముంజేతికంకణంబున కద్ద మేల - భంజింపఁబడు జినప్రతిమయ సాక్షి
యిలఁబ్రసిద్ధము నేఁడు నెఱుఁగుదు గాదె - హుళిగఱలోపల నోరి జైనుండ!

వైజకవ్వ కథ


వెండి బరవళిగవెలఁది వైజవ్వ - ఖండేందుధరపాదకమలాంతరంగ
మగఁడాదిగాఁబురి మనుజులందఱును - వగవఁగ జినమార్గవర్తులై నడవ
నాతి మగండొక్కనాఁడు జైనులకుఁ - బ్రీతితోఁబర్వంబు వెట్టునయ్యెడను
దరళాక్షి పదపదార్థములు గావించి - వరుఁడు జైనులఁబిలువంగఁబోయినను
దరుణియు నప్పదార్థములు వీక్షించి - "హరమూర్తియొకఁడైన నరుగుదేడఁయ్యె
బరికింపఁదాఁ జేయు పాయసాన్నములు - పరమేశ యితరులపా”లయ్యె ననుచుఁ
గడుఁగడు దుఃఖాన్నిఁగ్రాఁగుచు నున్న - యెడఁ దపోవేషియై మృడుఁడు యేతేరఁ
బడఁతియుఁగడుభయంపడి యప్పుడులికి - పడి వడి సంతోషపడి చక్కజాఁగఁ
బడి పలుమఱు మ్రొక్కఁబడి పాదధూళిఁ - బడి పొరలుచును బైఁబడి వైజకవ్వ
యాదిదేవునిమూర్తియగు తవరాజు - పాదంబులు గడిగి ప్రాశించి మ్రొక్కి
సముచిత సత్కారసంపదఁదనిపి - యమలిన దేహు సుఖాసీనుఁజేసి
పదపదార్ధమ్ములుఁ బక్వాన్నములును - గదళీదళం బిడి కన్ను దనియఁగ
వడ్డింపఁదపసియు వడి నారగింప - సడ్డలు సేయుచుఁ జప్పరింపంగ
సంతోషమునఁగుడ్వఁజనుదెంచి జైను - లంతకాంతకమూర్తి నల్లంతఁగాంచి
యంతన మగిడిపో నధిపుఁడేతెంచు - నంతన తపసియు నట్లదృశ్యముగఁ

  1. కవళంబు, కమలంబు
  2. దీపింప