పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

185

భావింప నీ రెండుఠావులు దక్క - దేవదేవుఁడు లేనిఠా వున్నదెట్లు
సకలంబుఁదానయై సకలంబునందు - నికము దాఁబొందని నేర్పరి యతఁడు
సకలంబుఁబుట్టించి సకలంబునందు - నికము వుట్టకయున్న నేర్పరి యతఁడు
సకలంబు నడపుచు సకలంబునందు - నికము దానడవని నిర్గుణి యతఁడు
సకలంబుఁద్రుంగించి సకలంబునందు - నికము ద్రుంగనియట్టి నిత్యుఁడతండు
సకలముఁదనలోన నందు లేకునికి - సకలము నడఁచెడు జాణఁ డతండు
సకలంబుఁదన నిజాజ్ఞాప్రభావమునఁ - బ్రకటించు [1]చైతన్యభావకుఁడతఁడు
సకలంబు లీల నిచ్చామాత్ర నిలిపి - వికృతంబు లార్చు నిర్వికృతి యతండు
కలిగి యంతటిలోనఁగలుగనివాఁడు - కలఁడన్న వారికిఁ గలిగుండువాఁడు
తలఁపుల మిగిలిన తత్త్వంబువాఁడు - తలఁచినవారికిఁ దన్నిచ్చువాఁడు
కొలఁదికి మీఱిన గుణములవాఁడు - కొలఁది యెఱింగినఁ గూడుండువాఁడు
వలపింపరానట్టి వలపులవాఁడు - వలచినఁబాయక వరమిచ్చువాఁడు
గమియింపరానట్టి గమకంబువాఁడు - గమియించువారికిఁగడసూపువాఁడు
పట్టంగఁజూచినఁబ్రభసూపువాఁడు - పట్టిన మఱి బట్టబయ లగువాఁడు
వినికికి మిగిలిన వేషంబువాఁడు - వినునంతలోనన విహరించువాఁడు
దృష్టికిఁదాటిన తేజంబువాఁడు - దృష్టించి చూచినఁదెలి వగువాఁడు
వాసనగడిచిన వర్తనవాఁడు - వాసనమైఁగూడ వర్తించువాఁడు
చవులకు మీఱిన సారంబువాఁడు - చవులఁబాసినఁదాఁబ్రసన్నుఁడౌవాఁడు
పలుకులు గడచిన బాసలవాఁడు - [2]పలుకు లెఱింగిన ఫలియించువాఁడు
[3]భక్తవత్సలుఁడనఁబరగినవాఁడు - శక్తికతీతుఁడై సడిసన్నవాఁడు
యుక్తికిమీఱిన యుక్తులవాఁడు - వ్యక్తి సాక్షాల్లింగమై యున్నవాఁడు
కావున మాలింగదేవునిమహిమ - భావింప నెఱుఁగ మీ ప్రాప్తియకాదు
రామనాథుండు సర్వంబును నగుట - భూమి నభక్తులఁబొందకుండుటయు
నప్రసిద్ధపుమాట లనవల దిపుడు - సుప్రసిద్ధముగ దృష్టప్రత్యయముగఁ
జూపెద మీరడ్గ నోపెదరేని - యీ పొట్లచెఱువులో నెన్నఁగఁబడ్డ
వసదు లేణ్ణూరును వ్రచ్చివైపింతు - పనుల మిమ్మేమని పఱుతు నే” ననిన
"నెన్నిమార్గంబుల నీతనిఁ జెఱుప - కున్నఁ”గాఁదని జైను లూహించి చూచి
“దృష్టాంత మిప్పుడు దృష్టమౌఁగాని - దుష్టోరగంబునఁదొడికింత” మనుచు

  1. సర్వజ్ఞభావకుఁ
  2. పలికినయట్లున్నఁబైఁబడువాఁడు
  3. భక్తికతీతమై పరగిన