పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

బసవపురాణము

అమలాత్మ! మాకింక నపవర్గపదవి - సమకూరు మీచేతఁజచ్చుటఁజేసి
యదిగాన మమ్ము దయామతిఁజూచి - బ్రదికింపవే” యని ప్రస్తుతింపంగ
నక్షయమూర్తి దివ్యజ్ఞానదృష్టి - నీక్షించి తత్కార్య మిట్లౌట యెఱిఁగి
యరుగుట సాలించి యంతన మగిడి - కరమర్థిఁగొంతవత్తిరిఁగోసికొనుచు
సరసర నసమానశరణాగ్రగణ్యుఁ - డరుదెంచి [1]కనుఁగొని యనురాగలీలఁ
బచ్చనితలచుట్టుఁబచ్చకు[2]ప్పసము - నచ్చెరువుగ విల్లు నమ్ములు వట్టి
నందనవన మరణ్యంబుపై విడియు - చందంబునను సహజక్రియఁబొల్చు
బలువేఁటకాఱు, నాపంచాస్యుమీఱు - చలమును బలమును గలజాగిలములు
దనుఁబరివేష్టించికొని యేఁగుదేర - ననఘుండు జొమ్మయ్య సన నరణ్యమున
సమ్మృగావలి యుబ్బి జొమ్మయ్య మీఁదఁ - గ్రమ్మనఁజనుదేరఁగా వేఁటకాఱు
సడి గేల డుయ్యుడు సారమేయములు - నడర నంకమపోలె విడిపించికొనుచుఁ
బొంగి మనోవేగమునఁగూడ ముట్టి - యంగద మృగముల నార్చుచు వ్రేయఁ
గుక్కలఁ జంకించి కోలల కెగసి - చక్కన జొమ్మయ్య శరముల కెదిరి
చచ్చుచు శాపమోక్షంబులు గాంచి - యచ్చోన గంధర్వులై నిల్చి తెలుఁగు
జొమ్మయ్యగారి పాదమ్ముల కెరఁగి - సమ్మదలీలఁ బ్రశంస సేయుచును
నతనిచే మరణంబు లగుటను జేసి - యతులితాగణ్యపుణ్యప్రాప్తిఁబొంది
ప్రవిమలకనక [3]దివ్యవిమానములను - శివలోకమునకుఁజెచ్చెర నేఁగుచుండఁ
గ్రూరత [4]నెగిదెడు కుక్కల మొఱిఁగి - తా రేయు శరములఁదప్పించుకొనుచు
జొమ్మయ్య చేతన క్రమ్మనఁజచ్చి - యమ్మృగరూపంబు లణఁగి మ్రొక్కుచును
గంధర్వులై కనకవిమానచయము - సంధిల్ల నేఁగు టాశ్చర్యంబు గాదె
“యదె కుక్కలేఁగు నా నంతలోపలను - నిదె పోయెఁబోయెనా నెగసిపోయెడును
ఎప్పాటనైనఁదా రేయుబాణములు - తప్పునే? తాఁకియుఁదాఁక వయ్యెడిని
మృగముల కేనాఁట మించివెలుంగు - గగనంబునను గనకవిమానపంక్తి
మేదినిఁగారణమృగరూపధారు - లాది వీ రెవ్వరో యాతఁడ యెఱుఁగు
నితరుఁడే జొమ్మయ్య యిహలోకరుద్రుఁ - డతులకారణపురుషావతారుండు”
నని తోడివేఁటకాండ్రచ్చెరువంది - వినుతింప నిబ్బంగి వేఁటలాడుచును
నిచ్చటి మృగముల నెరిఁబొలియించి - యచ్చుగా శివపురి కనుపుచు[5] నుండి
యుర్వీశుఁడాదిగా నొక్కొక్క[6]నాఁడు - సర్వజనంబులుఁజనుదెంచి చూడ

  1. వేవిన నను
  2. కుబుసము
  3. విమానమ్ములెక్కి
  4. నెగడెడు
  5. నుండె-నుర్వీ
  6. మాటు