పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

167

యజ్ఞానులార! మృగాకృతిగాఁగఁ - దజ్‌జ్ఞునిఁబోల్చిన తప్పునఁబోయి
పుట్టుఁడు మృగములై భువి” నంచు నప్పు - డిట్టలంబుగ శాప మిచ్చుడు వారు
నంత భయభ్రాంతు లగుచు [1]నక్షణమ - యంతంతఁబ్రణమిల్లి "యక్కటా!మీర
లానతిచ్చినయట్టు లన్నియునేల - కానమి మాయందుఁగలిగె నెంతయును
నదియును మున్నపహాస్యభావమున - మది నొండు దలఁచినమార్గంబు గాదు
ఐనను జాల నజ్ఞానంబు గలదు - తా నెట్టు దప్పునే తమకర్మఫలము?
ఇన్నియు నననేల? యీ శాపమోక్ష - మెన్నఁడు మా? కింక నెయ్యది దెఱఁగు?
ఇప్పుడు దయసేయవే మహాపురుష! - తప్పులు సైరించి దయతోడ” ననినఁ
“దప్ప దమోఘంబుఁదమశాప మనినఁ - జెప్పెడి దొండేమి సెచ్చెరమీరు
పుట్టుఁడు మృగములై భువిని గళ్యాణ - పట్టణాంకితవన ప్రాంతంబునందు
శూలిభక్తుఁడు దెల్గుజొమ్మయ్య యనఁగ - భూలోకపావనుఁడాలింగమూర్తి
చే మీకు మరణంబు సిద్ధించెనేని - కామించు శాపమోక్షంబగు మఱియు
నాయయ్యచేఁ జచ్చునమ్మాత్రఁజేసి - పాయనిముక్తిసంపదయు సిద్ధించు”
ననవుడు నట్లకా కనుచు గంధర్వు - లనురాగమునఁగటకాంతికంబునకు
మృగములై తొల్లింటిమెలఁతలుఁబతులుC- దగిలి యరణ్యమధ్యమునఁజనింప
మదిలోనఁదెలుఁగు జొమ్మయగారి రాక - కెదురుసూచుచునున్న యెడనొక్కనాఁడు
నలరుచు నయ్యరణ్యాంతరంబునను - దెలుఁగు జొమ్మయ్య వత్తిరిఁగోయుటకును
మెల్లన యేఁగఁగ మృగము"లితండ - తెల్లంబు గానోపుఁ దెలుఁగు జొమ్మయ్య
యనుచుఁజుట్టును నిల్చి యఱచుచునెందుఁ - జననీక యరికట్టుకొని నొక్కమృగము
“మరణంబుమీచేత [2] మాకైనఁగాని - కరుణాత్మ! శాపమోక్షంబు [3]దా లేదు
వేడుకమై నిత్యవిధి [4]కైన వేఁట - లాడవే మా మీఁద నఖిలోపకార!
గంధర్వులం దొక్కగార్యకారణము - సంధిల్లి మాకిట్టి శాపంబు వచ్చె”
ననుచుఁదద్వృత్తాంతమంతయుఁజెప్పి - "కనుఁగొన శాపమోక్షం [5]బగుటకును
దా నిక్క మిదియు మీచే నేము సావఁ - గానప్డు దివ్యవిమానము ల్వచ్చి
కొనిపోవుఁగైలాసమునకుఁదత్‌క్షణమ - జనులకు నెల్ల దృష్టప్రత్యయముగ
నరయ శాపంబె మున్నాయయ్య యీగి - వరము గాకిది మాకుఁబరికించిచూడ
నవధరింపఁగఁగల దది యెట్టులనినఁ - దవిలి ము న్నేము గంధర్వ లోకులము

  1. గంధర్వు- లంతంత
  2. మఱిగల్గకున్న
  3. గా
  4. నీవు
  5. బుగాంచుటకు-మహిమీఁద మీచేత మఱిమృతిఁబొంద - మహనీయ