పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

బసవపురాణము

సహజజంగమలింగసదయాభివినుత - నిహితప్రసాదవినిర్మలచరిత
స్వానుభవాతిశయానందమలరు - మానిత [1]సద్భక్తి మహిమ వర్ధిల్లు

తెలుఁగు జొమ్మయ్య కథ


మలహరసద్భక్తి [2]మహితుండు మఱియుఁ – దెలుఁగు జొమ్మయ్య నాఁ ద్రిమలాపహరుడు
సంతత సద్భక్తి సహజసౌభాగ్య - వంతుఁడు సర్వజీవదయాపరుండు
పుణ్యపాపోన్ముక్తపూతమానసుఁడ - గణ్యపుణ్యోదయకారణాత్మకుఁడు
ఆనందకలిత మహాప్రసాదావ - ధానసంధాన విద్యావిశారదుండు
నశ్రాంతశుద్ధశివాచారయుతుఁడు - విశ్రుతాంచితకీర్తి వీరసత్తముఁడు
లోకహితార్థుఁడలోకుండు శివప - దైకనిష్ఠాపూరితాంతరంగుండు
కలియుగజనితమృగవ్యాధరుద్రుఁ - డలఘుపరాక్రముఁడసమానదాని
శివభక్తిపరతంత్రసిద్ధుండు సకల - భువనపావనుఁడన భువి నుల్లసిల్లి
లింగార్చనక్రియాలీల సల్పుచును - జంగమారాధనాసక్తిఁగ్రాలుచును
ఘనరూఢిఁగళ్యాణకటకంబునందు - ననురాగలీల జొమ్మయ్య వర్తింప
నంత నిక్కడను శివానందుండు నా ని - రంతరలింగతద్ధ్యానాత్ముఁ డగుచుఁ
బరమపరానందపారవశ్యమునఁ - బరమకాష్ఠీభూతభావనఁదగిలి
శ్రీశైలమున సమంచితనిర్ఘర ప్ర - దేశంబునను సమాధిస్థుఁడై యుండఁ
బదనఖంబులు భువిఁబర్వి వెల్గుచును - విదితమై క్రిందికి వేళులు వాఱ
నలిఁగరస్థలి నఖములు వెలుంగుచును దెలుపారి మీఁదితీగలభాతిఁబ్రబల
నురుముక్తకేశంబు లొడలు గప్పంగ - ధర నీలగిరిమాడ్కి గురుమూర్తి దనర
నాయయ్య శిష్యుఁడత్యాయతభక్తిఁ - బాయక కొల్చుచుఁబరతంత్రలీల
ననయంబుఁగందమూలాహారుఁడగుచు - ననుషక్తిఁదానును నచటన యుండ
నంత వినోదార్థు లగుచు గంధర్వ - కాంతలుఁబతులు నక్కడ పోయి పోయి
“తెల్లఁదీగలతోడ నల్లఁదనంబు - నల్లది యెట్టిదో?” యనుచు "దూరమున
శిలయొకో శిలకుఁదీగలు [3]గల్గుటెట్టు - లిల వృక్షమో వృక్షమే నాకులెవ్వి?
ముదియెల్గు గానోపుఁగదలఁజాలకయ - యదె యున్న”దనుచు నంతంత వీక్షింప
సుదతులఁబరుషులఁజూపులఁజూచి - యదయుఁడై శిష్యుఁడత్యాగ్రహంబొదవఁ
“గానరా! పరమయోగానందమూర్తిఁ - దా నన్యభావనఁదలఁపంగఁదగునె?

  1. శివభక్తి
  2. కలితుండు
  3. గల్గెనెట్టు?