పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

బసవపురాణము

గన్నులమంటలు గ్రమ్మ నేతెంచి - కన్నంబువాకిటికనకంబుఁజూచి
యతివిస్మయాక్రాంతమతిఁ జిట్టమిడిచి - గతకోపుఁడై క్షితిపతి యిట్టులనియె
“నెక్కడిపసిఁడిప్రో వెక్కడి దొంగ - యెక్కడికన్న మిదేమి వన్నితివి?
బసవనమంత్రి! యేర్పడఁజెప్పు” మనిన - వసుధేశునకు బసవనమంత్రి యనియె
“భక్తుండు గన్నడ బ్రహ్మయ్యనాఁగ - వ్యక్తలింగం బనియుక్తప్రతాపి
కన్నడ బ్రహ్మయ్యగారి మహత్త్య - మెన్నఁగ శక్యమే యీశునకైన
నాతని శ్రీచరణాంగుష్ఠయుగము - ఖ్యాతిగాఁగల్పవృక్షములకు నూఁత
ఆ మహా[1]త్మునియమృతావలోకనము - కామధేనువులసంఘముపుట్టినిల్లు
చింతింప నాతనిచిత్తంబుచిగురు - చింతామణులకు నిరంతరాశ్రయము
అరయంగ నతనిహస్తాంగుళస్పర్శ - విరచింపఁగాఁబర్సవేదుల గనులు
నతని శ్రీపాదసంగతి ముక్తిభూమి - యతని ప్రసాదంబు నమృతంబుతేట
యతనికోపంబు సంహారకారణము - నతని కారుణ్యంబ యపవర్గ మింత
నణిమాదిసిద్ధులు నాతనిబంట్లు - గణుతింప నింత లింగసదర్థుఁడయ్యుఁ
బట్టిననియమంబుఁబాయక కన్న - పెట్టిన నర్థమెకాని ముట్టఁడు సేత
'నిది గుమార్గము భక్తియే' యనవలదు - ఇదియె తా సన్మార్గ మెట్టు లంటేని
యిలఁజూదమునఁబాండవులు భ్రష్టులైరి - నలిజూదమున మూర్ఖు నగజేశుఁగూడె
వేఁటాడి రాముండు వెలఁది గోల్పడియె - వేఁటాడి యెఱుకు దా విశ్వేశుఁగలసెఁ
బరసతీవశ్యులై నరపతుల్ ద్రుంగఁ - బరసతీవశ్యుఁడై హరుఁగూడె నంబి
చంపి మాండవ్యుంబు సరిఁగొర్తఁబడియెఁ - జంపి చండుండు ప్రసాదంబుఁ గనియె
బొంకిన బ్రహ్మకు భువిఁబుట్టుమాలె - బొంకి చిర్తొండండు బొందితోఁజనియె
గొఱియమ్రుచ్చని శూద్రకుఁడు [2]నఱకువడెఁ - గఱకంఠుగణనంది గలసెఁదెర్వడిచి
రమణ “రాజ్యాంతే నరక” మన ముక్తి - విమలతఁగనిరి చేరమయుఁజోడండుఁ
గాన యెట్లును నమార్గం బనరాదు - తా నీశ్వరార్థ మన్తలఁపునఁజేసి
ధర "నధర్మో ధర్మతాం వ్రజే” త్తనఁగ - హరునివాక్యముగాన యట్టిద పథము
నిన్నియు నననేల యిందఱకంటెఁ - గన్నడ బ్రహ్మయ్య గతి యెట్టిదనిన
నెప్పుడు జంగమం బేతెంచు నింటి - కప్పుడకాని పోఁడసహాయలీల
నిది వగ లిది రాత్రి యెట్లొకోయనుచు - మదిలోన లే దణుమాత్రంబు భయము
నదియును శివభక్త సదనంబ యేని - ముదమునఁబేర్సెప్పి మ్రొక్కుచువచ్చు

  1. పురుషుదివ్యావ
  2. నర్కఁబడియె