పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

155

గుక్కలవాకట్టుఁగొంకినారసము - గ్రక్కునఁగంకటిరజ్జువు నమర
సూచీముఖంబైనఁజొనుపంగరాని - యేచినచీకటి నిండ్ల పంచలకుఁ
జిడిముడి పలుకులఁ జేరి యుల్వరసి - గడియకన్నంబును గడపకన్నంబు
గోడకన్నంబును గుఱి [1]నేలకన్న - మోడక త్రవ్వి యి ల్లొయ్యన చొచ్చి
పరికించుచో భక్త భవనంబులైన - సరసరదీపంబు సంధించి వారి
పాదాబ్జములమీఁదఁబడి మేలుకొలిపి - పాదోదకంబు ప్రసాదంబుఁగొనుచు
“శరణనియెడి సత్యశరణులయిండ్ల - వరవుడ బ్రహ్మఁడన్వాఁడ నే” ననుచు
నెడనెడ నేఁగుచు నితరు[2]లిండ్లైనఁ - దడయక పదపదార్థంబులు దేవి
కొనివచ్చి జంగమకోటికి వరువుఁ - బను లాచరించు చిప్పాట వర్తింప
జంగమ[3] మొకనాఁడు చాల నేతేర - భంగిగా నిది పట్టపగలని యనక
“నేలకన్నంబిడి నిఖిలేశునగరఁ - జాలనర్ధముఁదెత్తుఁజక్కన” యనుచు
నరుగుచో బసవఁడు పురవీథిఁ గాంచి - యరుదొంద భువిని సాష్టాంగుఁడై మ్రొక్కఁ
“బట్టుము గత్తియు బలపంబుఁగన్న - పెట్టఁబోవలయు నా కిట్టున్న భంగి
నొం[4]డెడ ధనములే దొనర బిజ్జలుని - బండారమిలు సూప బసవ! ర” మ్మనినఁ
బ్రత్యుత్తరం బీనిబాస గావునను - నత్యనుచిత మన 'కట్లకా' కనుచుఁ
గన్నడ బ్రహ్మయ్య గారిఁ దోడ్కొనుచుఁ - గన్నంపుము ట్లెల్లఁగరమర్ధిఁగొనుచు
నునుపరియునుబోలె నొడక నగరు - చనఁజొచ్చి బండారుసదనంబుఁజూప
గడియకన్నం బిడఁగాఁబదడెల్లఁ - గడసన్న పసిఁడియై పుడమి వెలుంగఁ
జొచ్చి పెట్టెలలోని సొమ్మెల్లఁగొనుచు - విచ్చేసె బ్రహ్మయ్య యచ్చెరువంద
నంగరక్ష[5]కులెల్ల నరిగి యట్లున్న - భంగిన యవ్వారఁబతి కెఱిఁగింప
బసవఁడునాబారిఁబాఱె బొమ్మనుచుఁ - గసిమసంగుచు మహోగ్ర[6]మునరేఁగుచును
నవుళులు గీఁటుచు “నక్కటా! తన్ను - శివభక్తుఁడని విశ్వసించుటయెల్ల
వఱితిపాలుగఁ జేసెఁ జిఱుతవాఁడనక - యఱలేక మన్నించు [7]నంతయుఁగంటిఁ
బట్టపగలు గన్నపెట్టించె బసవం - డెట్టొకో ప్రాణంబుఁబట్టియున్నాఁడు
అడిగిన వలసి [8]నంతర్ధ మీ నెట్టు - లడరఁగ విశ్వాసియయ్యె నిట్లింత
కెత్తికొన్నాఁడింక నిటమీఁద నెంత - కెత్తికోనున్నాఁడొ యెఱుఁగరా”దనుచుఁ

  1. లేని
  2. లయిండ్లఁ
  3. ములొక
  4. డేడ
  5. కులుదారరిగి
  6. తను
  7. టంతయుఁ గలిగె
  8. నయంతర్థమీనె-య