పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

153

కడిఁదిపాతకము లిక్కడఁబ్రసాదంబు - గుడిచినఁ[1]జెడు సమకూఱ దేనియును
నొడఁబడ నిచ్చటికడువనీరైనఁ - బుడిసెఁడు ద్రావినఁబొలియుఁబాపములు”
నని తలపోయుచుఁజనియె నా బసవఁ - డనురాగచిత్తుఁడై; యంత నిక్కడను
మధ్యాహ్నమగుటయు మారయ్య లింగ - తద్ద్యానసుఖనిరంతరవర్తి యగుచు
వాకిటఁగట్టెలు వైచి యేతేర - నా కాంత యెదురేఁగి యడుగులు [2]గడుగ
భంగిగా జంగమ[3]ప్రణిపత్తి [4]దీర్చి - లింగార్చనంబు సల్లీలఁజేయుచును
బడిగంబు క్రిందట బసవఁడు మున్న - [5]యడకిన మాడల విడియలు గాంచి
"యెక్కడివిడియ లిం? దెవ్వరు వచ్చి - రిక్కడి?” కని తనయింతి నడ్గుడును
“దేవ! యొక్కయ్య యేతెం చారగించె - భావింప నటమీఁది పను లే నెఱుంగ
నప్పుడ విచ్చేసె” నని విన్నవింపఁ - "[6]దప్పదు బసవఁడు దాన కానోపుఁ
గడు నర్థసంపదగల భక్తులరసి - బడుగుభక్తులఁబ్రోవఁబాడియ కాదె?
దాత గాఁడే యిట్లు దాఁబ్రోవ కెవరు - ప్రోతురు మేలయ్యెఁబో బ్రదికితిమి
తన బిడ్డఁడని [7]మనఁదలఁచి యిచ్చటకిఁ - జనుదెంచె నింతియ చాలదే మాకు
నిమ్ముల మాలింగ మిచ్చిన కాయ - కమ్మ యీ పూఁటకుఁగలిగున్న” దనుచుఁ
జక్కన నిద్దఱు జంగమంబులకు - నొక్కొక్క విడియ నియోగించి మ్రొక్కి
సదమలస్థితి నున్న జంగమకోటి - [8]పద పద్మములు గడ్గి భక్తితో వారి
శ్రీపాదజలములు సిలికింపఁగట్టె - మోపు [9]గడానియై యేపారి వెలుఁగ
వేడుక మదిఁదులుకాడ వేయేసి - మాడలయెత్తుగాఁగూడ ఖండించి
యున్నజంగమకోటి కొక్కొక్కనక్కు - చెన్నుగా నర్పణసేసి మ్రొక్కుడును
నక్కజం బందుచు నా జంగమములు - గ్రక్కున బసవనికడఁబ్రసరించి
“మిక్కిలి భక్తికి నిక్కంబు నియతి - కెక్కుడు చేఁతకు సెల్లయై పరగు
మోళిగ మారయ్యఁబోరంగ భక్తు - లేలోకమునఁగలరే” యని పొగడ
బసవఁడు! యిట్లేల యానతిచ్చెదవు? - నిన్నన్న దేమేని మున్నెండు గలదె?
[10]బడుగు భక్తులకెల్లఁబ్రాణంబునిన్నుఁ - గడ [11]సన్నభక్తులు గలరె యిబ్భువిని
మాబోటి భక్తులమనికియు నునికి - నీ బయిసియె కాదె నిఖిలోపకార!
విని యెఱుఁగము దొల్లి విడియ లనంగఁ - గనుఁగొనఁబడియె నీ కారణంబునను

  1. జను
  2. గడిగి
  3. ప్రతిపత్తి
  4. దీర్ప
  5. యడికిన, యడఁచిన
  6. దప్పుఁడు
  7. మమ్ముఁ
  8. పదములుగడిగివే భక్తితో
  9. సువర్ణమైదీపించి
  10. బడగు
  11. చిన