పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

బసవపురాణము

చదివెదు వెక్కులు శ్లాఘ్యమే? పసిఁడి - వెదవెట్టఁ [1]బంతు నే వీథులనెల్ల
ఇస్పిరో! లంజెర్కమే యిట్లు నీకు - దుస్సి కట్టుదుగాక దొంతరలెల్ల
బ్రతుకంగనోపునే పడఁతి యీసారె - నెదిరి నే మనఁజాలు నే లింకఁబడుపు
బొజుఁగులు గొఱియలఁబోకార్పఁగలరు - ప్రజలకుఁదనకును బట్టుగ్రాసంబు
మజ! బాపురే! లంజె మనెడుఁబొమ్మనఁగ - గుజగుజలకు నెల్ల [2]గుఱియైతినింక
నగుబాటు వట్రిల్లె నాతులలోన - మొగమెత్తనేర్తునే? మున్నెఱుఁగవొకొ!
అభిమానకత్తె దానగుట నీ” వనుచు - నభిమాన మెడలంగ నతివ వల్కుడును
“బాయఁ జూ పెనుఁబెనుఁబండువు [3]లందు - వేయేల గొఱియల వేయుమాడలకు
విలిపించి మఱి కదుపులభంగిఁదెత్తు - వలసినంతర్థంబు వ్ర(వ్య?)యమున కిత్తుఁ
జిన్నవోనిత్తునే చెలువలలోనఁ - జెన్నుగాఁ బండువుసేయు మీ" వనిన
“వేల్పుల కని మున్ను విలిచినగొఱియఁ - బాల్పడి తేకున్నఁబండువుసేయ
వెఱతుము సంపునో వేల్పు ద"మ్మనిన - నఱిముఱి 'నట్ల కాకనుచుఁదత్ క్షణమ
కామాంధునకు నొక్క గార్యంబుఁగాన - రామి దెల్లముగాన రయమున వచ్చి
గొఱియఁబట్టుడుఁదద్దఁ గోపించి చూచి - పరువడిఁగిన్నర బ్రహ్మయ్య [4]యెదిరి
“పట్టకుపట్టకు బసవరా [5]జాన - పట్టినఁదలఁ దెగఁగొట్టుదు నింక
నంజుదురే శరణాగతవజ్ర - పంజరం బిదియె మా భక్తులబిరుద”
మనుచుఁడగ్గఱుడు వాఁడలుగు [6]వెర్కినను - గినిసి రౌద్రోద్రేకమునఁ బొంగివ్రేసి
నిశితఖడ్గాయుధనిహతుఁగావింపఁ - బశుపతిగుడి వెలిఁబడియె శిరంబు
'బాస హీనునిబొంది వాడియే శివు ని - వాసంబునం దుండ దోస' మన్నట్టు
లట్టయు నీడ్పించి [7]యగడ్తవైపించెఁ - గట్టలు గట్టి మూఁకలు సూచుచుండ
[8](నంత నా వృత్తాంత మక్కర్మిబంధు - లెంతయు విని తమ యిచ్చలో వగచి
తగువారుఁదామును ధరణీశుఁజేరి - వగచుచు నేడ్చుచు జగతీశుకనిరి)
“త ప్పేమియును లేదు దమవాఁడు గొఱియ - చొప్పునఁజనిగుడిసొచ్చి పట్టుడును
భక్తుఁడు గిన్నర బ్రహ్మయ్య నాఁగ - శక్తిమంతుఁడుగాన చంపె” నావుడును
నుర్వీశ్వరుండు గోపోద్రేకవహ్ని - వర్వ నిట్లనిపల్కె బసవయ్యఁజూచి
“హరుభక్తు లధికదయాపరు లండ్రు - నిరపరాధులఁజంప నీతియే మీకు

  1. బుత్తు
  2. గొలఁదైతి
  3. సేయ
  4. యెయిది, పలికె, యెఱిఁగి
  5. రాజదియు
  6. వెర్కుడును
  7. యగడితవైచె (దీనినిగూర్చి పీఠికలో చూడుడు)
  8. (నక్కర్మిచుట్టాలుఁ బక్కాలునంత గ్రక్కున బిజ్జలుకడ మొఱలిడుచు)