పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

బసవపురాణము

ఇరువదాండారి కథ

జంగమలింగభాస్వద్భక్తి యుక్తి - సంగతిదినములు [1]జరపుచునుండ
నంతకాంతకుఁడు భక్తాకృతి వచ్చి - బొంతయుఁగచ్చడంబును దాఁప నిచ్చి
యంత నప్పుడ యదృశ్యము సేసి పిదప - బొంతయుఁగచ్చడంబును వేఁడఁదడవ
చెచ్చెరఁదనదాఁచి నచ్చోట వెదకి - యెచ్చోటఁగానక "యెత్తున కెత్తు
ననఘ! మీ కిచ్చెద" నని తులాయష్టిఁ - దనర [2]వేఱొకబొంతయును గచ్చడంబు
నొక్కదిక్కునఁబెట్టి యున్న దిక్కునను - బెక్కువస్త్రంబులు నెక్కొల్పి తూఁప
సమము గాకుండినఁదమయింటఁగలుగు - నమితాంబరంబులు నర్ధంబుఁదాను
వచ్చి యత్తుల యెక్క వరదుఁడక్షణమ - మెచ్చి యా ప్రమథత్వ మిచ్చుడు ధరణిఁ
బాండురాంగునిభక్తిఁబరగిన యిర్వ - దాండారి కనుగులంబైన భృత్యుండ

దంగుళి మారయ్య కథ


జంగమార్థంబకా సకలార్థములును - భంగిగాఁజలుపుచుఁ [3]బరగుదుర్దశను
నడవంగ శివుఁడొకనాఁడు వర్షమునఁ - దడియుచు నర్ధరాత్రం బేఁగుదేర
'వరతపోధనమూర్తి వడఁకెడు' ననుచు - వరుసతోఁదనపాక వ్రచ్చి కాల్పంగ
'నాఁకొంటి' ననవుడు నట తొలునాఁడు - వీఁకతో నలికినవిత్తులు నీళ్ల
[4]విదళించికొని తెచ్చి వేఁపి దంపించి - సుదతియుఁదాను నుత్సుకలీలతోడఁ
బాకయత్నము సేసి భక్తి వడ్డించి - శ్రీకంఠు నపుడ మెచ్చించి విముక్తి
సంగతి సుఖలీలఁజనినట్టి యెళయ - దంగుళిమారయ్య [5]లెంగిలిబంట

గణపాలుని కథ


భవి నొక్కరునిఁదన భువి నుండనీక - శివసహితులఁజేయుఁజేకొనకున్న
వేదార్థములు దెల్ఫి యాదిఁజూపియును - గాదన్న దృష్టసంపాదనఁజూపి
యడిగిన [6]నెంతర్థమైనను నిచ్చి - యెడఁబఱుపంగ సర్వోపాయములను
గఱకంఠుభక్తుండు గానొల్లకున్న - మఱి చంపునదియె నేమముగ వర్తింపఁ
బరమేశ్వరుఁడు దన బాసలోఁతరయ - నరుదెంచి [7]వెలమఁడై"యరి యప్పనంబు
[8]గానుక గట్నంబుఁగడఁగి సుంకంబు - పూనిక వెట్టియుఁబొరి [9]నెన్నుఁబన్ను
[10]నరువ నేమియుఁదన్ను నల [11]జడి వెట్ట - ధరణీశ తగ” దంచుఁదా మొఱలిడఁగ

  1. సలుపుచు
  2. రెండొక
  3. బరమహర్షమున
  4. విదలిం
  5. లెంగుల
  6. నెంతైన నర్థంబులిచ్చి
  7. వెలువఁ(మఁ)డై?
  8. గానిక
  9. నరయి
  10. మట