పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

137

'దాలింగ' మనిమ్రొక్కఁదన కంఠమందు - వాలంబు మున్నువూమాలగాఁజేసి
యక్షరుం డపుడు ప్రత్యక్షమై నిలిచి - యక్షరత్వంబు దయామతి నొసఁగ
క్షోణి లసత్కీర్తిఁగొఱలినయట్టి - యేణాధినాథుని యిలుపుట్టుబంట

చేదివల్లభుని కథ


అట్టు విభూతి రుద్రాక్షధారులను - నెట్టును శివుఁడనియెడిభక్తియుక్తిఁ
జరియించుచుండంగఁబరరాష్ట్రపతులు - దురమునఁదనచేత విరథులై పాఱి
రుద్రభక్తులభాతి రూఢిగాఁబంచ - ముద్రధారులఁబదుమువ్వురఁజేసి
పనుచుడుఁగపటలాంఛనధారు లపుడు - చనుదేరనతిభక్తి వినమితుం డగుచు
దారు[1]ణాంచితనిశాతక్రూరశస్త్ర - ధారల [2]జర్జరితంబు సేయంగఁ
బరికించియు నితరభావంబు లేక - గురురూపకాఁగఁగైకొని మ్రొక్క నపుడ
ప్రత్యక్షమై నిల్చి పార్వతీనాథుఁ - డత్యుత్తమంబు నిత్యత్వంబు నొసఁగ
సల్లలితోన్నతిఁజనిన విముక్తి - వల్లభుఁడగు చేదివల్లభుబంట

కరయూరిచోడని కథ


సంగతంబుగ నట్ల శాసనధరుల - భంగిగాఁదన ప్రాణలింగంబ యనుచుఁ
బరమవిశ్వాస సద్భక్తిభావమునఁ - బరగుచో నన్యభూపతులపై దండు
వుచ్చుడు ముప్పదివొణకల తలలు - నచ్చెరువుగఁగొట్టి తెచ్చుచో నందు
నెత్తుట నొకదల జొత్తిల్లి బిగిసి - యత్తఱి జడతల యనుపోల్కి నున్నఁ
గనుఁగొని 'హరహరా!' యని తత్ క్షణంబ - తనతలఁదఱిగి యత్తలమీఁదఁబెట్ట
నంతటిలోనఁబ్రత్యక్షమై నిల్చి - కంతుసంహరుఁడు మోక్షము గరుణింప
మును జడతల కిచ్చె ముడితల యనఁగఁ - జను కరయూరిచోడని బంటుబంట

కళియంబనైనారు కథ


పనిసేయ నోపక బానిసకొడుకు - చని లింగధారియై చనుదేరఁదడవ
బానిసకొడు కనుభావంబు లేక - తా నీశుఁడనుచుఁబాదంబులు గడుగ
“మన సిరియక [3]కొడ్కుమల్లండు వీనిఁ - గనుఁగొనవే కాళ్లు గడిగెద!” వనుచుఁ
జులుకఁగాఁ బూర్వంబుఁ దలఁచి పల్కుచును - బొలఁతి జలంబులు వోయకున్నంత
“నాలినేసితి గదా హరమూర్తి” ననుచు - నాలి చేతులు రెండు నప్పుడ నఱకి
మలహరుకారుణ్యనిలయుఁడైనట్టి - కళియంబనైనారిగాదిలిబంట

  1. దాఁచిన
  2. దనువు జర్జరితంబుసేయ(?)
  3. కన్న