పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

బసవపురాణము

వలయెత్తి నీటిలో [1]వైవంగఁదడవ - వలఁదొల్త వచ్చిన వలుఁదమత్స్యంబు
నదియు 'శివప్రీతి' యనిపోవ విడుచు - నిదియ నేమముగాఁగ నితరమత్స్యముల
నంగడిఁ బోకార్చి యందుల లబ్ధి - జంగమారాధనల్ సలుపుచు లీలఁ
జరియింప దినములు సనఁగ వేఁటయును - బరికింప నేనాళ్లువాఱమి డస్సి
వలఁగొని మఱునాఁడు [2]వైవంగఁదొలుత - వలనుగా నందు సువర్ణమత్స్యంబు
వచ్చిన నదియు 'శివప్రీతి' యనుచు - నచ్చోన పోవిడ్చి యవలవైచుడును
నమ్మీన వచ్చుడు నారేవు విడిచి - యెమ్మెయి వలవైవ నెప్పటి మీన
తగులంగ విడువంగఁదగులంగఁ విడువఁ - బగలెల్ల నమ్మీన పట్టువడంగ
“నాత్మశునకుఁబ్రియంబన్న మత్స్యంబు - నాత్మార్ధమై [3]కొను టనుచితం”బనుచు
నింటికి నేతెంచి యిట రాత్రి వుచ్చి - తొంటి యేటికిఁబోక తూర్పు దీర్ఘికను
వల యెత్తివైచుడుఁదొలినాఁటిమీన - మలరుచు వచ్చుడు నట్ల పోవిడిచి
మఱి వైవ నమ్మీన మసలి వచ్చుడును - జిఱునవ్వు నవ్వుచు "శివునిమత్స్యంబు
నేడ చూచినదాన యీ యేట [4]వైవ - నాడ [5]యీశ్వరు మీన మరుదెంచెనేని
వలఁజేతఁబట్ట నా వ్రత మిదియనుచు - వలయెత్తి యూఁకించి వైచి తివ్చుడును
వలతోన తొడిఁబడి వచ్చి ముక్కన్ను - నలిఁ జతుర్భుజములు నందివాహనము
నమరంగ శివుఁడు ప్రత్యక్షమై నిలిచి - ప్రమథేంద్రపదవి యారంగ నిచ్చుడును
నా నిరంతరపరమానందసుఖము - లానుచునున్నట్టి యడిభర్తబంట

ఏణాధినాథుని కథ


అనయంబు భూతిరుద్రాక్షధారణులఁ - దన ప్రాణలింగభావన విశ్వసించు
నిదియ నేమముగాఁగ నేలాపురమున - సదమలలీల రాజ్యంబుఁజేయుచును
నొడఁబడ గెలిపించె నొడినవీటఁ - బడి భరం బేఁగి కప్పంబులు గొనుచు
నవనీశులకు నెల్ల నక్కుఁగొఱ్ఱగుచు - భువిఁబ్రవర్తింప నబ్భూపతు లొక్క
దళవాయి శాసనధారిఁగావించి - బలసహితంబుగాఁబనుపఁగఁదడవ
తన తంత్రమును దానుఁ జనుదెంచి తాఁకి - యనిసేయు భూతిరుద్రాక్షధారణునియుఁ
గని 'శివ శివ' యంచుఁగరవాలువైచి - చనుదెంచి భువిఁజక్కఁజాఁగిలిమ్రొక్క
'నెటువోదుపొ'మ్మంచు [6]నటయేఁగుదెంచి - స్ఫుటశక్తిఁగరవాలుఁబూఁచి[7]వైచుట

  1. వయ్యంగఁ
  2. వయ్యంగఁ
  3. కొనుడను; కొననను
  4. నేయ, వయ్య?
  5. నీ
  6. నతఁడేగు
  7. వ్రేయుడును